ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కడం సరికాదు' - Govt has shown utter disregard for people's voices: Sonia Gandhi

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పౌరచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగిస్తుండటాన్ని ఆక్షేపించారు.

sonia
'ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కడం సరికాదు'
author img

By

Published : Dec 20, 2019, 8:41 PM IST

పౌరచట్టానికి వ్యతిరేకంగా నినదిస్తోన్న ప్రజల గొంతును భాజపా ప్రభుత్వం...పోలీసు బలగాలతో నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. పౌరచట్టం వివక్షాపూరితమన్న సోనియా.. ఇది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. పౌరచట్టంపై ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారు కాంగ్రెస్ అధ్యక్షురాలు. విద్యార్థులకు, ఆందోళనకారులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతోందన్నారు. పౌరచట్టంతో పాటు ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ.. పేదలను బాధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కడం సరికాదు'

"కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న విద్యార్థులు, యువత, ప్రజలను అణిచేందుకు భాజపా ప్రభుత్వం.. పోలీసు బలగాలను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎం వంటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో... భాజపా ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలపై స్వచ్ఛందంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో తప్పుడు నిర్ణయాలు, విధానాలపై మాట్లాడేందుకు, అభిప్రాయాలను తెలిపేందుకు ప్రజలకు హక్కు ఉంది. అదేసమయంలో పౌరుల అభిప్రాయాలను తెలుసుకోవడం ప్రభుత్వ విధి. భాజపా ప్రభుత్వం ఆందోళనకారుల మాటలు వినేందుకు సిద్ధంగా లేదు. వారిని అణిచేందుకు పోలీసు బలగాలను వినియోగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

రాజకీయ లబ్ధి కోసమే...

దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది స్వార్థపరులు పౌరచట్టంపై ఆందోళనలను ఎగదోస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్ నఖ్వీ. పౌరచట్టానికి ఇటీవల చేసిన సవరణల వల్ల భారతీయ ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల వారికి వచ్చే నష్టమేమి లేదన్నారు. ప్రజలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'పౌర' చట్టంపై సలహాల స్వీకరణకు ప్రభుత్వం సిద్ధం!

Odisha, Dec 20 (ANI): Pinaka Missile System developed by Defence Research and Development Organisation (DRDO) was again successfully tested on December 20 off the Odisha coast on December 20. The extended range version of the missile can hit targets at 90 kilometres.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.