ETV Bharat / bharat

ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!

ఇటీవల గాంధీ కుటుంబానికి ఎస్​పీజీ (ప్రత్యేక రక్షణ దళం) భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వీఐపీ భద్రతలో అత్యంత కీలకమైన ఎన్​ఎస్​జీ (జాతీయ రక్షణ దళం) కమాండోలను తొలగించనుందట.

Govt decides to withdraw NSG from VIP security duties
ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!
author img

By

Published : Jan 12, 2020, 6:12 PM IST

Updated : Jan 12, 2020, 7:47 PM IST

ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్​ క్యాట్స్'​ ఉండరు!

దేశంలోని వీఐపీల భద్రతా విధుల్లో బ్లాక్​ క్యాట్​ కమాండోలు ఇక ఉండరా? గాంధీల కుటుంబ భద్రతలో ప్రత్యేక రక్షణ దళం-ఎస్​పీజీని తొలగించినట్లే.. ఇక వీఐపీలకు జాతీయ రక్షణ దళం- ఎన్​ఎస్​జీ భద్రతను కేంద్రం తొలగించనుందా? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు.

రెండు దశాబ్దాలుగా వీఐపీలకు బ్లాక్​ క్యాట్​ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. తీవ్రవాద చర్యల నుంచి వీఐపీలను కాపాడేందుకు.. దీటైన భద్రత కోసం వీరిని ప్రభుత్వం వినియోగిస్తోంది. అయితే ఇప్పుడు ఈ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఆ 13 మందికే...

ఎన్​ఎస్​జీ బ్లాక్​ క్యాట్​ కమాండోల భద్రత దేశంలోని 13 మందికి మాత్రమే ఉంది. అధునాతన ఆయుధాలను చేతబట్టి ఆ వీఐపీలు ఎక్కడికి వెళ్లినా వారి భద్రతను ఈ కమాండోలు పర్యవేక్షిస్తారు. ఒక్కొక్కరికి దాదాపు 24 మంది కమాండోలు రక్షణగా ఉంటారు.

ఏం చేస్తారు...?

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్​ యాదవ్​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, ఫరూక్​ అబ్దుల్లా, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​, మాజీ ఉప ప్రధాని ఎల్​కే అడ్వాణీకి భద్రత కల్పిస్తోన్న ఈ కమాండోల స్థానంలో త్వరలో పారామిలటరీ దళాలు రానున్నాయి.

ఎందుకు..?

ఎన్​ఎస్​జీ అనేది పేరుకు తగ్గట్లు జాతీయ భద్రత, తీవ్రవాదంపై పోరు, యాంటీ- హైజాక్​ ఆపరేషన్ల కోసం వినియోగించాలని భద్రతా అధికారులు భావిస్తున్నారట. ముప్పు ఎక్కువ ఉన్న ప్రముఖులకు ఎన్​ఎస్​జీ భద్రతను ఇవ్వడం కాస్త భారంగా ఉందని హోంమంత్రిత్వ శాఖ అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యేక దళంగా...

వీఐపీలకు ఈ భద్రతను తొలగిస్తే 450 కమాండోలు ఖాళీ అవుతారు. వీరిని దేశంలోని ఐదు ప్రధాన రక్షణ కేంద్రాలు సహా దిల్లీ సమీపంలోని గురుగ్రామ్​లోని ముఖ్య రక్షణ స్థావరంలో నియమించనున్నారట.

సీఆర్​పీఎఫ్​...

ఈ 13 మంది వీఐపీల భద్రతను త్వరలో సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​ చేపట్టనున్నాయి. ఇప్పటికే ఈ రెండు దళాలు దేశంలోని 130 మంది ప్రముఖుల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
ఈ మధ్యే ఎస్​పీజీ భద్రతను ఐదుగురు ప్రముఖులకు తొలగించారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ దంపతులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ జాబితాలో ఉన్నారు.

Howrah (West Bengal), Jan 12 (ANI): Prime Minister Narendra Modi on 150th anniversary celebrations of Kolkata Port Trust announced the new name of Kolkata Trust Port as 'Syama Prasad Mookerjee Port'. "This port will now be known as Syama Prasad Mookerjee port. This port represents industrial, spiritual and self sufficiency aspirations of India. Today, when the port is celebrating its 150th anniversary, it is our responsibility to make it a powerful symbol of New India," said PM Modi.

Last Updated : Jan 12, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.