లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే దీపావళి వేళ మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా.. మీ నోరు బంగారం గానూ అంటూ మహారాష్ట్ర ఠానేలోని ఓ స్వీటుషాపు వినియోగదారులకు ఓ వినూత్న ఆఫర్ అందిస్తోంది. బంగారంతో చేసిన మిఠాయిలను అందుబాటులో ఉంచి పసిడి రుచిని ప్రజలకు అనుభవంలోకి తెస్తోంది.
బంగారాన్ని తినడం ఎలా అని మీ సందేహమా..? అదేనండీ.. స్వీటుపై ఉండే అలంకరణ కాగితాన్ని పసిడితో తయారు చేసింది ఈ దుకాణం. పుత్తడితో చేసిన ఈ మిఠాయి ధరా ఎక్కువేనండోయ్.! కిలో రూ. 11,000.
ఠానేలోని ప్రశాంత్ కార్నర్ అనే మిఠాయి దుకాణం ఈ బంగారు స్వీట్‌ను తయారు చేసింది. దీపావళి సందర్భంగా ఏటా ఈ స్వీటును తయారు చేసి అమ్ముతుంటారు నిర్వాహకులు. ప్రజలు కూడా దీనిని కొనేందుకు అమిత ఆసక్తి చూపుతుంటారు.
ఇదీ చూడండి: డిసెంబరు 6లోపే రామ మందిర నిర్మాణం: సాక్షి మహరాజ్