ETV Bharat / bharat

కశ్మీర్, లద్దాఖ్​ల​కు లెఫ్టినెంట్​ గవర్నర్ల నియామకం

జమ్ముకశ్మీర్​కు లెఫ్టినెంట్​ గవర్నర్ల నియామకం
author img

By

Published : Oct 25, 2019, 8:11 PM IST

Updated : Oct 25, 2019, 9:01 PM IST

20:02 October 25

కశ్మీర్, లద్దాఖ్​ల​కు లెఫ్టినెంట్​ గవర్నర్ల నియామకం

జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర చివరి గవర్నర్‌గా సేవలందించిన సత్యపాల్‌ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్‌, లద్ధాఖ్‌లకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీశ్‌ చంద్ర ముర్ము, లద్ధాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాధా కృష్ణ మాథుర్‌లను నియమించింది.

1985 ఐఏఎస్​ బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌కు చెందిన గిరీశ్‌ చంద్ర ముర్ము... గతంలో ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఖర్చుల విభాగానికి కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 1977 ఐఏఎస్​ బ్యాచ్ త్రిపుర కేడర్‌కు చెందిన రాధా కృష్ణ మాథుర్‌... గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భారత ప్రధాన సమాచార కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుత కేరళ భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌ పిళ్లైను మిజోరం గవర్నర్‌గా నియమించారు.

అక్బోబర్​ 31న జమ్ముకశ్మీర్..​ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించనుంది. 

New Delhi, Oct 25 (ANI): While speaking to media in an event in the national capital, the skipper of Indian Cricket Team Virat Kohli on newly-appointed BCCI president said, "Today, I am going to meet the newly appointed BCCI President Sourav Ganguly in a while to discuss certain things. It is very much necessary to discuss things at a good level." "It will be a healthy discussion because two of us are into playing cricket. He has played in the past years and I am playing it now," Kohli added.
Last Updated : Oct 25, 2019, 9:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.