ETV Bharat / bharat

భారత​ తొలి  సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం​ - CHIEF OF DEFENCE RAWATH

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సైన్యాధ్యక్షుడు బిపిన్​ రావత్​ నియమితులయ్యారు. రేపటి నుంచి సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Gen Bipin Rawat appointed Chief of Defence Staff
భారత్​ తొలి త్వివిధ దళాధిపతిగా బిపిన్ ​రావత్​
author img

By

Published : Dec 30, 2019, 10:50 PM IST

Updated : Dec 30, 2019, 11:42 PM IST

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్​ బిపిన్​ రావత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి రావత్​ సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సైన్యాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు​.

సైన్యాధ్యక్షుడి కంటే ముందు పలు కీలక విధులు నిర్వహించారు రావత్​. పాకిస్థాన్​ సరిహద్దులోని నియంత్రణ రేఖ, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖల వద్ద కీలక బాధ్యతలు చేపట్టారు. భారత త్రివిధ దళాలను మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారునిగా వ్యవహరించే సీడీఎస్​ ఏర్పాటుకు కేబినెట్​ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపింది.

ఇప్పటికే సీడీఎస్‌కు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 65 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సైన్యం, నౌకాదళం, వాయుసేన అధిపతులు గరిష్ఠంగా మూడేళ్లపాటు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందయితే అది) పదవుల్లో కొనసాగుతున్నారు. వారిలో ఎవరైనా సీడీఎస్‌గా నియమితులైతే 65 ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగేందుకు వీలుగా సైన్యం, నౌకాదళం, వాయుసేన సర్వీసు నిబంధనలను రక్షణ శాఖ తాజాగా సవరించింది.

Mumbai, Dec 30 (ANI): Nationalist Congress Party (NCP) leader Ajit Pawar took oath as Minister during cabinet expansion of Maharashtra on Dec 30. Ajit Pawar will be Deputy Chief of Maharashtra. Chief Minister of Maharashtra Uddhav Thackeray was also present during the oath taking ceremony. A total of 36 cabinet ministers, 13 from Shiv Sena, 13 from NCP and 10 from Congress, will take oath today in cabinet expansion. Shiv Sena-NCP-Congress formed coalition government in Maharashtra after Shiv Sena's rift with BJP.
Last Updated : Dec 30, 2019, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.