చెత్తకు తగ్గ భోజనం
ఈ కేఫ్‌కు డబ్బులు తీసుకుని వెళ్లాల్సిన పని లేదు. కానీ, చేతి నిండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువెళ్లాలి. ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాన్ని తెచ్చిస్తే భోజనం, అరకిలో ప్లాస్టిక్ తెచ్చిస్తే అల్పాహారం పెడతారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలన్నది... ఈ కేఫ్ ఏర్పాటు వెనుక ఉద్దేశం. ఇలా సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు నిర్మిస్తామని మేయర్ అజయ్ తిర్కే తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించి నగరంలో ఒక రోడ్డును నిర్మించారు కూడా.
నాణ్యత
ఈ గార్బేజ్ కేఫ్‌లో చెత్త తీసుకుంటున్నారు కదా అని ఆహారం కూడా అలానే ఉంటుందని అనుకోవద్దు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్నే వినియోగదారులకు అందిస్తున్నారు.
మంచి రెస్టారెంట్‌లాగా హుందాగా నిర్మించేసరికి చూసేందుకు వచ్చిన జనంతో మొదటి రోజే కేఫ్ రద్దీగా మారింది.
ఇదీ చూడండి:విమానంలో ఎంపీకి 'పెంకుల' ఆమ్లెట్, పాడైన ఆలూ