పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను, దుకాణాలను ఆందోళనకారులు మూసేశారు. పలు జిల్లాల్లో రోడ్లపై వాహన టైర్లను కాల్చి, రాకపోకలు అడ్డుకున్నారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి.
దిబ్రూగఢ్‌లో విద్యార్థులు పోలీసులపై రాళ్లు దువ్వారు. ప్రతిగా రబ్బరు బులెట్లు, బాష్పవాయువును ప్రయోగించారు భద్రతా సిబ్బంది. చౌల్ఖోవాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు.