సాధారణంగా ఎవరైనా కృతిమ మేధ కలిగిన కంప్యూటర్ కొనుక్కుంటే ఆఫర్ కింద ఏమిస్తారు? వైర్లెస్ కీ బోర్డ్, మౌస్, హెడ్ ఫోన్స్, పెన్ డ్రైవ్ ఇలా సంబంధిత వస్తువులేవైనా ఉచితంగా ఇస్తారమో..! కానీ తమిళనాడు కడలూరుకు చెందిన 'తమిళ్ కంప్యూటర్స్' సేల్స్ షాపు యజమాని వినూత్న ఆఫర్ పెట్టాడు.
ఓ కంప్యూటర్ కొంటే కేజిన్నర ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి... తన షాపు ముందు పెట్టాడు. అంతే ఈ ప్రకటన ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఇప్పుడా ప్రజలు తన షాపు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం... ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
దేశంలో ఉల్లి ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. కిలో ధర రూ.200 వరకు పలుకుతుంది. ఈ కారణంగా.. పలు చోట్ల ఉల్లిగడ్డలు దొంగతనానికి గురవుతున్నాయి. పలు భోజనశాలల్లో ఉల్లిగడ్డల వినియోగం ఆపేశారు.
ఇదీ చూడండి : 'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్!