దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతన్న తరుణంలో అసోంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. దిబ్రుగఢ్, చరైడియా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నాలుగు గ్రెనేడ్లు పేలడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
దిబ్రుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాహమ్ బజార్, ఏటీ రోడ్లోని గురుద్వారా ముందు రెండు చోట్ల ఈ పేలుళ్లు జరిగాయి. దిబ్రుగఢ్ జిల్లాలోని దులియాజన్ ప్రాంతంలో మరో గ్రెనేడ్ పేలింది.
చరైడియా జిల్లాలోని సొనారి పోలీస్ స్టేషన్ పరిధిలో టియోక్ ఘాట్ ప్రాంతంలో మరో గ్రెనేడ్ దాడి జరిగింది.
సీనియర్ పోలీసు అధికారులు ఘటనాస్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుళ్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు