ETV Bharat / bharat

దేశంలో తొలి ట్రాన్స్​జెండర్​ నర్స్​గా అన్బూ రూబీ

author img

By

Published : Dec 3, 2019, 10:40 AM IST

Updated : Dec 3, 2019, 1:13 PM IST

దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్​జెండర్​ ప్రభుత్వ నర్స్​గా నియమితురాలైంది. తమిళనాడు పోటీపరీక్షల్లో సత్తా చాటిన అన్బూ రూబీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు​ అందుకుంది.

For the first time ever, a transgender woman was appointed on Monday as a nurse by Tamil Nadu Health and Family Welfare Department.
దేశంలో తొలి ట్రాన్స్​జెండర్​ నర్స్​గా అన్బూ రూబీ
దేశంలో తొలి ట్రాన్స్​జెండర్​ నర్స్​గా అన్బూ రూబీ

తమిళనాడులో ఓ ట్రాన్స్​జెండర్​ ప్రభుత్వ నర్స్​గా ఉద్యోగం సంపాదించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా పేరు పొందింది అన్బూ రూబీ.

ఎన్నో ఒడుదొడుకలను ఎదుర్కొని.. ఇంటర్మీడియట్​ తరువాత నర్సింగ్​​ పూర్తి చేసింది అన్బూ. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్స్​గా పనిచేసింది. తరువాత పోటీపరీక్షల్లో ప్రతిభ చాటింది. తమిళనాడు​ ముఖ్యమంత్రి కే పళనిస్వామి, ఆరోగ్యమంత్రి సీ విజయభాస్కర్​ ఆమె ప్రతిభను గుర్తించి స్వయంగా తమ సంతకాలతో ఉద్యోగం ఖరారైనట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్​మెంట్ ఆర్డర్​ అందుకుంది అన్బూ. ట్రాన్స్​జెండర్లను సమాజం నుంచి వేరుగా చూడొద్దని, తమను ప్రోత్సహిస్తే ఏదైన సాధిస్తామని చెబుతోంది అన్బూ..

"నేను ఈ ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తొలి ప్రభుత్వ ట్రాన్స్​జెండర్ నర్స్​గా గుర్తింపు పొందాను. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రులకు​ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నేను ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానిని. మా నాన్న అంధుడు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది."

-అన్బూ రూబీ, ట్రాన్స్​జెండర్ నర్స్

దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్​జెండర్..​ నర్స్​ బాధ్యతలు చేపట్టనుండటం.. అందులోనూ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం రాష్టం గర్వించదగ్గ విషయం అన్నారు ఆరోగ్యమంత్రి.

'తమిళనాడు ఆరోగ్య సంక్షేమ విభాగంలో మొట్టమొదటి సారిగా ట్రాన్స్​జెండర్ నర్స్​గా నియమితురాలైంది అన్బూ. ఇది రాష్ట్రానికే గర్వకారణం.'

-సీ విజయభాస్కర్, రాష్ట్ర ఆరోగ్యమంత్రి

ఇదీ చదవండి:'నిర్భయ నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించకండి'

Vijayawada (Andhra Pradesh), Dec 03 (ANI): Archer Jyothi Surekha Vennam returned to India. She won gold in the mixed pair event in archery, alongside Abhishek Verma. She won the medal compound bow category at 21st Asian Archery Championships in Bangkok on November 27.
Last Updated : Dec 3, 2019, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.