ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పుర్‌లో ఘోరం జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐటీబీపీ జవాన్లు ఘర్షణ పడ్డారు. బంగాల్ నదియాకు చెందిన కానిస్టేబుల్ మసూదుల్ రహ్మాన్... సహచరులపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
సహచరుల్ని హత్య చేసిన తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రహ్మాన్.
ఈ ఘటనను ఐటీబీపీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘర్షణకు దారి తీసిన కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు.
రహ్మాన్ చేతిలో గాయపడ్డ జవాన్లు రాయ్‌పుర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.