భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా లెఫ్టినెంట్ శివాంగి రికార్డులకెక్కారు. శిక్షణ పూర్తి చేసుకొని డిసెంబర్ 2న ఆమె విధుల్లోకి చేరనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శివాంగి స్వస్థలం బిహార్‌లోని ముజాఫర్‌పుర్. 27 ఎన్ఓసీ కోర్సులో భాగంగా పైలట్‌గా భారత నౌకాదళంలో చేరారు. శిక్షణ పూర్తి చేసుకొని కొచ్చిలో విధుల్లో చేరనున్నారు. శివాంగి డోర్నియర్ విమానాలను నడపనున్నారు.
ఇదీ చూడండి:వినూత్నం: పుష్పగుచ్చాలు వద్దు-పుస్తకాలే ముద్దు..!