దేశంలోనే తొలిసారిగా ఉత్తర్ప్రదేశ్ మధుర జనపద్లోని చుర్మురా గ్రామంలో 'ఏనుగు స్మారక కేంద్రాన్ని' ప్రారంభించారు.
10 ఏళ్లలో 5 ఏనుగులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందాయి. సరైన చికిత్స అందకపోవడం వల్లే గజరాజులకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సంస్థ సంరక్షణ చర్యలు చేపట్టింది. వాటి జ్ఞాపకార్థం ఇలా ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి గజరాజుల సంరక్షణా బాధ్యతలు చూస్తుంది.
'దేశంలో మొదటి ఏనుగు మెమోరియల్ సెంటర్ ప్రారంభించాం. అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధ పడుతున్న ఏనుగులను చికిత్స కోసం ఎలిఫెంట్ హాస్పిటల్ సెంటర్కు పంపుతాం. మరణించిన ఏనుగుల జ్ఞాపకార్థం ఈ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించాం.'
- కార్తీక్ సత్యనారాయణ, వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ అసిస్టెంట్ ఫౌండింగ్ సీఈఓ
ఇదీ చదవండి:ట్రాన్స్జెండర్ అమ్మగా మారింది.. బాక్సర్లుగా తీర్చిదిద్దింది!