పూర్ణ-హైదరాబాద్ ప్యాసింజర్లో కలకలం రేగింది. 19 ఏళ్ల యువకుడు చేసిన వెర్రి చేష్టలు ప్రాణాలపైకి తీసుకొచ్చింది. రైలులోని శౌచాలయానికి వెళ్లి తన నోట్లోనే టపాసును పేల్చుకున్నాడు. ఈ ఘటన వల్ల ప్రయాణికులు షాక్కు గురయ్యారు.
ఇదీ జరిగింది...
19 ఏళ్ల సయ్యద్.. పూర్ణ-హైదరాబాద్ ప్యాసింజర్లో ప్రయాణించాడు. పరాలీ రైల్వై స్టేషన్ దాటిన అనంతరం... శౌచాలయానికి వెళ్లాడు. తన వద్ద ఉన్న టపాసును నోట్లో పెట్టుకుని పేల్చుకున్నాడు. పెద్ద శబ్దం రావడం వల్ల ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు వల్ల బోగీలో స్వల్పంగా మంటలు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. అయితే సయ్యద్ ఈ వెర్రి చేష్టకు ఎందుకు పాల్పడ్డాడో స్పష్టత లేదు.