ETV Bharat / bharat

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం - దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.  ఆరంతస్థుల భవనంలోని... ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరి ఆడకపోవటం వల్లనే చనిపోయినట్లు సమాచారం.

Fifirebroke out at a house in Anaj Mandi in delhi
దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న సహాయకచర్యలు
author img

By

Published : Dec 8, 2019, 9:01 AM IST

Updated : Dec 8, 2019, 12:55 PM IST

దిల్లీ అనాజ్‌ మండీ ప్రాంతంలోని బహుళ అంతస్థుల భవనంలో ఉన్న ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 43 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. కూలీలంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అందువల్లనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 50 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం వల్ల 30 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకుగా ఉండటం వల్ల సహాయ చర్యలకు ఇబ్బందికరంగా మారింది.

అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు ఉదయం 5.30 గంటలకు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కాలంచెల్లిన మందుగుండే దిక్కా: కాగ్​ నివేదిక

Tirupati (Andhra Pradesh), Dec 08 (ANI): A 70-year-old residential building has been collapsed in Andhra Pradesh's Tirupati on December 07. No casualties were reported in the incident as four families who lived in the building were not there when the mishap took place. Locals have requested the authorities to ensure protection of buildings which are on the verge of collapsing.
Last Updated : Dec 8, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.