ETV Bharat / bharat

విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి! - కొత్త విత్తన చట్టం

విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. మరి విత్తనంలోనే కల్తీ ఉంటే పంటలెలా పండేది,  భారత రైతు ఎలా బతుకీడ్చేదీ? అందుకే విత్తనం నుంచి రైతుకు భరోసా కావాలి.  సమగ్ర విత్తన చట్టాలు రావాలని కోరుతున్నారు అన్నదాతలు.

విత్తనంపై గుత్తాధిపత్యం వద్దు.. కొత్త చట్టం కావాలి!
author img

By

Published : Nov 15, 2019, 8:41 AM IST

భారత్‌లో వ్యవసాయం రైతుల జీవన విధానం. అన్నదాతకు సేద్యం ఎప్పుడూ నిరాశనే మిగులుస్తోంది. అదేం విచిత్రమోగానీ రైతులను మినహాయిస్తే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన దళారులు, వ్యాపారులు వంటి వర్గాలన్నీ లాభాల బాటలోనే సాగుతున్నాయి. విత్తన కొనుగోలు నుంచి మార్కెట్లలో పంట విక్రయించడం వరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా సమగ్ర చట్టాలు లేకపోవడం పెద్ద లోపం.

రైతు కోరేది ఇదే

విత్తన చట్టమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వరంగ విత్తన సంస్థలు రంగంలో ఉన్నప్పుడు రూపొందించిన నిబంధనలే, ప్రైవేటు రంగం విస్తరించిన కాలంలోనూ ఆచరణలో ఉండటం రైతుల ప్రయోజనాల్ని బలిపెట్టడమే.

వ్యవస్థలోని లోటుపాట్లు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నా దశాబ్దాలుగా చోద్యం చూసిన పాలకులు కొత్త విత్తన చట్టం రూపకల్పన వైపు త్వరితంగా అడుగులు వేయడం అవసరం. ఈ క్రమంలో విత్తన బిల్లు ముసాయిదాను మరోసారి దేశం ముందుంచిన మోదీ ప్రభుత్వం కొత్త విత్తన చట్టానికి రూపకల్పన చేయాలని రైతులోకం కోరుకుంటోంది.

చట్టం గట్టిగా లేనందునే

ఇప్పటికే అమల్లో ఉన్న విత్తన చట్టం ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రైతులు వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేస్తే రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది.

చట్టంలోని నిబంధనలు కఠినంగా లేకపోవడంతో కొన్ని కంపెనీలు లేదా విక్రేతలు కొందరు కీలక అధికారుల్ని ప్రభావితం చేస్తూ, కొద్దిపాటి జరిమానాలతో తప్పించుకుంటున్నారు. పెద్దసంఖ్యలో రైతులు నష్టపోయిన కేసుల్లో మాత్రం వ్యక్తులు/కంపెనీల లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా పలు కంపెనీలు మారుపేర్లతో అవే విత్తనాలను తయారు చేస్తూ విపణిలోకి ప్రవేశిస్తున్నాయి.

ఇవన్నీ ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, నిఘా విభాగాలకు తెలిసినా రైతుల్ని వంచించే క్రమంలో వీరి మధ్య నెలకొన్న అపవిత్ర సంబంధాలు అన్నదాతల ఉసురు తీస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మిగిలిపోయిన విత్తనాలను తదుపరి పంటకు తిరిగి కొత్తగా ప్యాకింగ్‌ చేసి విక్రయించడం, జన్యు స్వచ్ఛత లేని వాటినీ సరికొత్త విత్తనాలతో కలగలిపి మార్కెట్‌ చేయడం వంటి అనుచిత పనులు చేస్తుంటాయి.

ఫలితంగా రైతులకు దిగుబడి తగ్గుతుంది. కొంతమంది పేరొందిన కంపెనీల విత్తన ప్యాకెట్ల మాదిరిగానే అచ్చుగుద్దినట్టు ముద్రించి రైతులకు అంటగడుతున్నారు. ఇలాంటి నకిలీ విత్తనాల్ని నియంత్రించాల్సిన బాధ్యత నిఘా యంత్రాంగానిదే.

ప్రయోజనం అంతంతమాత్రం

పార్లమెంటరీ స్థాయీ సంఘం 2004 విత్తన బిల్లులో ఉన్న లోపాలను గుర్తించి, చేసిన సూచనలను కొత్త ముసాయిదా చట్టం 2019లో చేర్చలేదు. ఈ ముసాయిదాను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం దేశం ముందుంచింది.

బిల్లుపై ఏవైనా అభ్యంతరాలుంటే నవంబరులోగా సూచించాలని కోరింది. 2019 విత్తన చట్టం ముసాయిదా సెక్షన్‌-21 ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల రైతులు నష్టపోతే విత్తన అమ్మకం దారుల నుంచి 1986 వినియోగదారుల చట్టం కింద రైతులు పరిహారం పొందవచ్చని ప్రస్తావించారు. ఇది సరికాదు.
విత్తనం అమ్మిన వ్యక్తులు లేదా కంపెనీలు నష్టపరిహారాన్ని కేవలం ఆ మొత్తానికి వడ్డీ కలిపి చెల్లించాలని ఫోరం తీర్పు చెబుతుందే కానీ, ఆ విత్తనాలు వాడటం వల్ల రైతు ఒక పంట కాలాన్ని, తద్వారా కోల్పోయిన దిగుబడికి తగ్గ పరిహారాన్ని ఇవ్వాలని ఫోరం ఆదేశించదు. పైగా ఫోరం తీర్పులు ఏళ్ల తరబడి సాగుతుండటం కూడా రైతులకు నష్టమే.

ఇందుకు నష్టపరిహారం అందించే కేంద్ర, రాష్ట్ర స్థాయి విత్తన కమిటీలలో రైతులు, కర్షక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విత్తన కంపెనీలు తమ విత్తనాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకోవడాన్ని ముసాయిదాలో రద్దు చేయడం బాగుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ధరలను నియంత్రించే సావకాశం కమిటీకి ఉంటుందని బిల్లులో పేర్కొనడం వల్ల వాణిజ్య పంటల విషయంలో విత్తన ధరలను నియంత్రించడం కష్టమవుతుంది. తద్వారా రైతులు మరింత ఇబ్బందిపడే అవకాశముంది. కాబట్టి ధర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు విధిగా నియంత్రణ ఉండేలా ముసాయిదా మార్చాలి.

సెక్షన్‌-40 ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విత్తన రకాల విషయంలో పర్యావరణ రక్షిత చట్టం ప్రకారం నిబంధనలను నిర్దేశించారు. దిగుమతి చేసుకునే విత్తనాలను కనీసం 21 రోజుల పాటు ‘క్వారంటైన్‌’లో పెట్టి క్షేత్రసాయిలో తగిన పరిశోధనలు చేసి మన వాతావరణంలో పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన అవసరముంది. ముసాయిదాలో ఆ మేరకు మార్పులు చేపట్టాలి.

విత్తనంలో కల్తీ చేస్తే అంతే

సాధారణంగా విత్తన స్వచ్ఛత నూరు శాతం, మొలక 80శాతం ఉండాలి. అంతకు తగ్గితే వాటిని నాసిరకాలుగా నిర్ధారిస్తామని ముసాయిదాలో పేర్కొనాలి. సెక్షన్‌-23 ప్రకారం వ్యవసాయ పట్టభద్రులకే డీలర్‌ లైసెన్స్‌ ఇవ్వాలి.

విత్తన మోసాలు, విత్తనాల జన్యుస్వచ్ఛత, విత్తన నాణ్యత లోపించినప్పుడు విత్తన అమ్మకందారులకు రూ.25 వేల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు జరిమానా, గరిష్ఠంగా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశం కల్పించారు.

2004 చట్టంలోనే రూ.50 వేల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం గరిష్ఠంగా ఏడాది జైలుశిక్షతో సహా జరిమానా రెండు లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు విధించాలని సూచించినా ఆ మేరకు 2019 చట్టం ముసాయిదా జరిమానాలను తగ్గించింది.

వీటిని స్థాయీ సంఘం సూచనల ప్రకారం పెంచాల్సిన అవసరముంది. అనుచిత కార్యకలాపాలకు పాల్పడే విత్తన విక్రేతలు, కంపెనీల విత్తన లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయాలి. వారిపై పీడీ చట్టాన్ని ఉపయోగించి భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలి. ఆషా, రైతు స్వరాజ్య వేదిక, అఖిల భారత రైతు సంఘం కేంద్ర వ్యవసాయశాఖకు పంపిన సూచనలను ముసాయిదాలో చేర్చితే విత్తన చట్టాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది.

రైతులకే హక్కులుండాలి

విత్తనోత్పత్తి వ్యాపారంలోకి ప్రైవేటు కంపెనీలు విస్తృతంగా రాని రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగ విత్తన సంస్థలే ఉన్న కాలంలో రూపొందించిన 1966 విత్తన చట్టమే నేటికీ చలామణీ అవుతుండటం గమనార్హం. విత్తనోత్పత్తి విషయంలో కంపెనీలు పలు అంశాలను రహస్యంగా ఉంచుతుంటాయి.

విత్తనాల ఉత్పత్తి, ప్యాకింగ్‌, అమ్మకాల వివరాలను వ్యవసాయశాఖకు తెలియజేయాలనే నిబంధనలు పాత చట్టంలోనే ఉన్నా ఆ శాఖ వద్ద సమాచారం లేదంటే- పర్యవేక్షణ ఎంత లోపభూయిష్ఠంగా ఉన్నదో అర్థమవుతోంది. కొన్ని కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయించే విషయంలో మధ్యవర్తులను పెట్టుకుంటాయి. నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోవు. దీనివల్ల పరిహారం సమయంలో మధ్యవర్తులు జారుకుంటే రైతులు అన్యాయం అవుతున్నారు

ఇలాంటప్పుడు మూడోపక్షంగా జిల్లా వ్యవసాయాధికారులు ఉండాలని రైతుసంఘాలు సూచిస్తున్నాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో కూడా కంపెనీలు ఒక రకానికి అనుమతులు తెచ్చుకుని అనధికారికంగా తదుపరి తరం విత్తనాలపై స్వేచ్ఛగా క్షేత్రస్థాయి ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. వీటిపై నిషేధం అమల్లో ఉన్నా చర్యలు తూతూమంత్రంగా సాగుతుండటం వ్యవస్థలోని మరో లోపం.

విత్తనం స్వచ్ఛమైనదై ఉండాలి

ప్రతి విత్తనాన్నీ విధిగా రిజిస్టర్‌ చేయాలంటూ ముసాయిదాలో నిబంధన చేర్చడం మంచి పరిణామం. స్వయంగా విత్తనోత్పత్తి చేసి విక్రయించుకునే విషయంలో ఎలాంటి బ్రాండ్‌పేరు లేకపోయినా స్వేచ్ఛగా అమ్ముకునే సావకాశం రైతులకు ఉండాలి. రైతులు క్షేత్రస్థాయిలో వారి విత్తనాలను సాగు చేసినప్పుడు కంపెనీలు ప్రకటించిన లక్షణాల మేరకు అవి ఫలితాలనిచ్చాయా అనేది ముఖ్యం.

ఈ విషయంలో తేడాలుంటే కంపెనీలపై చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉండాలి. దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇక్కడి చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకునేలా బహుళ జాతి కంపెనీల కార్యకలాపాలు ఉండాలని, ఎలాంటి వెసులుబాట్లు ఇవ్వకుండా బిల్లును చట్టరూపంలోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా రైతులు, రైతుసంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

కొత్త విత్తన చట్టం ఇలా ఉండాలి

కొత్త విత్తన చట్టం తమ ప్రయోజనాలను పరిరక్షించేదిగా ఉండాలని రైతులు కోరుతున్నారు. విత్తన ధరల నిర్ణయంలో కంపెనీల ఇష్టానికి వదిలిపెట్టకుండా ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విత్తనాలు నాసిరకాలని తేలినప్పుడు వాస్తవ పంట నష్టాన్ని చెల్లించేలా కంపెనీలు జవాబుదారీ కలిగి ఉండాలని రైతులు కోరుతున్నారు.

నకిలీ, నాసిరకాలు సరఫరా చేసే వారు ఇతర పేర్లతో విత్తన వ్యాపారం చేపట్టకుండా జీవితకాలం నిషేధించడంతో పాటు, కఠినంగా శిక్షించాలి. దేశీయ విత్తన రంగం ప్రభావితం కాకుండా విత్తనోత్పత్తిపై రైతులకున్న స్వేచ్ఛను హరించకుండా చట్టాలను బలోపేతం చేయాలి. దేశంలో విత్తనోత్పత్తి చేసే సంస్థ లేదా వ్యక్తుల కార్యకలాపాలు ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉండాల్సిన అవసరముంది.

నకిలీలపై కొరవడిన నియంత్రణ

పండించిన పంట నుంచే విత్తనాలను దాచుకుని వాటినే వాడుకోవడం సాంప్రదాయకంగా మన రైతులకున్న అలవాటు. సంకర జాతి వంగడాలు వచ్చాక ఈ పరిస్థితి కొంత మారింది. సంప్రదాయ పంటల తరహాలో కేళీలు ఏరివేసి తదుపరి పంటకు విత్తనాలు వాడుకునే వెసులుబాటు సంకరజాతి, జన్యుమార్పిడి పంటల్లో ఉండదు. నాటిన ప్రతిసారీ కొత్తగా కొని వాడుకోవాల్సిందే.

ఈ కారణంగా విత్తనాల కోసం రైతులు కంపెనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య పంటల విషయంలో 90-95 శాతం రైతులు సంకరజాతి, జన్యుమార్పిడి విత్తనాల కోసం కంపెనీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్‌ వాటా తక్కువగా ఉన్నప్పటికీ విత్తన వినియోగం రీత్యా అతి పెద్ద మార్కెట్లలో మనదీ ఒకటి. ఈ కారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రసన్నం చేసుకునే దిశగా ఈ కంపెనీలు భారీ లాబీయింగ్‌ చేసే శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నాయి.

ముసాయిదా రైతులకా? కంపెనీలకా?

దేశంలో విత్తన కంపెనీలకు అడ్డుకట్ట వేసి రైతుల హక్కుల్ని కాపాడతామంటూ 2002లో కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టం కోసం రైతు సంఘాల సూచనలు కోరింది. 2004లో పాక్షికంగా ఒక ముసాయిదాను రూపొందించింది. దీనికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. 2010లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచనల మేరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విత్తన బిల్లు ముసాయిదాకు పూర్తి రూపమిచ్చేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు కోరింది.

పాత ముసాయిదాకు స్వల్ప మార్పులు చేసి 2010 విత్తన బిల్లును రూపొందించారు. ఇందులోని నిబంధనలు రైతులకంటే కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించేవిగా ఉన్నాయంటూ రైతుసంఘాలు వ్యతిరేకించడంతో ఇది చట్టరూపం దాల్చకుండా ఆగిపోయింది. విత్తనోత్పత్తి చేసే సంస్థలపై కఠిన చర్యలు ప్రతిపాదిస్తూ పలు రాష్ట్రాలు ముసాయిదాకు సవరణలు తెలిపినా విత్తన కంపెనీల లాబీయింగ్‌ ముందు అవి నిలవలేకపోయాయి.

ఇదీ చదవండి:నవంబర్​ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్​

Lucknow (UP), Nov 15 (ANI): Dead body of a 10-year-old girl was found in Uttar Pradesh's Lucknow. Incident took place in Gosaiganj police station area. A report was filed at a police station on November 09. Body has been sent for post mortem and investigation is underway.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.