మహారాష్ట్రకు ‘కుటుంబ రాజకీయాలనేవి కొత్తేమీ కాదు. అధికారం కోసం పోరులో ఎన్సీపీనేత శరద్‌పవార్‌కు...ఆయన సోదరుడి కుమారుడైన అజిత్ పవార్‌కు మధ్య చోటు చేసుకున్న పరిణామాలు తాజావి. అయితే, ఇలాంటి సమీప బంధువుల కథలు మహారాష్ట్రకు కొత్తేమీ కావు.
బాల్‌ఠాక్రే-రాజ్‌ఠాక్రే
శివసేన అగ్రనేత బాల్‌ఠాక్రేకు... ఆయన తమ్ముడి కుమారుడైన రాజ్ ఠాక్రేకు మధ్య కూడా ఇలాంటి ఆధిపత్య పోరాటమే జరిగింది. పెదనాన్న బాల్‌ఠాక్రే ఎంతసేపూ కుమారుడైన ఉద్ధవ్‌ఠాక్రేనే పైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారంటూ రాజ్ తిరగబడ్డారు. వేరుకుంపటి పెట్టేశారు. ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’(ఎంఎన్‌ఎస్)ను స్థాపించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 స్థానాల్లో 13నియోజకవర్గాల్లో గెలుపు సాధించిన విషయం గమనార్హం.
గోపీనాథ్ ముండే-ధనంజయ్ ముండే
భాజపా నాయకుడు గోపీనాథ్‌ముండే, ఆయన సోదరుడి కుమారుడైన ధనంజయ్ ముండేది కూడా ఇదే కథ. గోపీనాథ్ ముండే తన కుమార్తె పంకజకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుండంతో ధనంజయ్ కలత చెందారు. సోదరిని పైకి తెచ్చేందుకు జరుగుతున్న యత్నాలతో విసిగివేసారి వేరుకుంపటి పెట్టారు. ఎన్సీపీలో చేరారు. రాష్ట్రశాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో సోదరిపై విజయాన్ని సాధించారు. కుటుంబ కలహాల విషయంలో ఇవన్నీ ఒక ఎత్తైతే శరద్-అజిత్ పవార్‌ల వ్యవహారం మరోఎత్తన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ కేసులో గోప్యత, నటన, దగా కలగలిసి అనూహ్య పరిణామానికి కారణమైనాయి.
ఇదీ చూడండి: 'విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పెట్టుబడులతో ఉద్యోగాలు'