ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించే పూజారులు సైతం ఈ కొలనులో స్నానం చేసిన తర్వాతే పూజలు నిర్వహిస్తారు. అయితే, మలికప్పురం నుంచి వంద మీటర్ల దూరంలో ఉండే ఈ కొలనులో కేవలం స్నానం మాత్రమే చేయాలి. అందుకే ఇక్కడ స్నానం చేసేటప్పుడు నూనె, సబ్బు వంటివి వాడటం పూర్తిగా నిషేధం.
మాల ధరించిన స్వాములు తమ వస్తువులను, పాత్రలను శుభ్రం చేసుకునేందుకు, ఆలయానికి సమీపంలో పత్రకుళం అనే మరో కొలను ఉంది. అందుకే భస్మాకుళం కొలనులో నిత్యం వందలాది మంది స్నానాలు ఆచరించినా.. నీరు శుభ్రంగా ఉంటోంది.
ఇదీ చదవండి:పదేళ్ల బాలుడి ఫిర్యాదుకు.. ఫ్రెండ్లీ పోలీస్ ఫిదా!