13 భారతీయ భాషల్లో సమాచారాన్ని అందిస్తున్న అతిపెద్ద డిజిటల్ వార్తా స్రవంతి ఈటీవీ భారత్‌కు ఓటరు అవగాహన అవార్డు వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో ఓటరు చైతన్యం కోసం చేసిన కార్యక్రమాలను గుర్తించి అవార్డును ప్రకటించింది జిల్లా అధికార యంత్రాంగం. ఈ గౌరవ పురస్కారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధులకు అందజేశారు.
జాతీయ ఓటరు అవగాహన దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాలో ఓటరు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సహా పలు ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టినందుకుగాను ఈటీవీ భారత్‌కు అవార్డును అందించారు. కలెక్టర్ సరన్ మిట్టర్ చేతుల మీదుగా ఈటీవీ భారత్ తరఫున విలేకరి దేశ్ దీపక్ గుప్తా ఈ అవార్డును స్వీకరించారు.
గత పదేళ్లుగా జనవరి 25ను ఓటరు అవగాహన దినోత్సవంగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. అధికారులకు దిశానిర్దేశం