ETV Bharat / bharat

ఆ ఇంజినీర్ 'నాటు కోడి' వ్యాపారం సూపర్ హిట్!

'ఇప్పుడు చదువుకోకపోతే పెద్దయ్యాక గొర్రెలు కాయాల్సిందే' అని బడిలో టీచర్ తిట్టడమే.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడికి ఆశీర్వాదం అయ్యింది. అయితే, ఇంజినీరింగ్ చదివిన ఆ కుర్రాడు టీచర్ చెప్పినట్టు గొర్రెలు కాయలేదు కానీ, అలాంటి మోటు పనినే వృత్తిగా ఎంచుకున్నాడు. నాటు కోళ్లు పెంచడం మొదలుపెట్టి.. ఇప్పుడు ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచాడు.

Engineering graduate makes a mark in country hen breeding!
ఆ ఇంజినీర్ 'నాటు కోడి' వ్యాపారం.. సూపర్ హిట్టు!
author img

By

Published : Sep 19, 2020, 10:53 AM IST

ఆ ఇంజినీర్ 'నాటు కోడి' వ్యాపారం.. సూపర్ హిట్టు!

తమిళనాడులో ఓ ఇంజినీర్ నాటు కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కోయంబత్తూర్ జిల్లా, కమ్మల తొట్టిపాలెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చాలీచాలని జీతం కోసం ఉద్యోగం చేయడం నచ్చలేదు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. తన దగ్గరున్న డబ్బుతో కొన్ని నాటు కోళ్లు కొని వాటినే వృద్ధి చేశాడు. రెండేళ్లుగా నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు.

Engineering graduate makes a mark in country hen breeding!
ఇంజినీర్ వ్యాపారిఅయితే...

" 2016లో ఇంజినీరింగ్ పరీక్షలయ్యాక రెండు చోట్ల ఉద్యోగం చేశాను. కానీ, వచ్చే జీతం నా ఖర్చులకే సరిపోలేదు. ఆదాయం ఎక్కువ కావాలంటే సొంత వ్యాపారం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నా. చాలా చోట్ల తిరిగి రకరకాల నాటు కోడి జాతులను సేకరించాను. ఆపై వాటిని పెంచి నాన్-వెజ్ రెస్టారెంట్లకు విక్రయించడం మొదలుపెట్టాను."

- కృష్ణమూర్తి

ఇంత చదువుకుని కోళ్లు పెంచుకోవడమేంటని తల్లిదండ్రులు వద్దన్నారు. కానీ, కృష్ణ పట్టుదలతో వ్యాపారం మొదలుపెట్టాడు. కడక్​నాథ్, కిన్ని జాతి కోళ్లతో పాటు అరుదైన బాతులు, కుందేళ్లు, పావురాలను పెంచి వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. కోయంబత్తూర్, తిరుప్పూర్, నీలగిరి జిల్లాల్లోని రెస్టారెంట్లకు కోళ్లు విక్రయిస్తున్నాడు. మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా.. ఇప్పుడు వ్యాపారం బాగా సాగుతోందంటున్నాడు. దీంతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాడు కృష్ణమూర్తి.

మేలు జాతి కోడితో.. లాభాలు

చదువుకుని మోటుగా కోళ్లు పెంచడమేంటని వెక్కిరించిన గ్రామస్థులే తనయుడి ఆలోచనను మెచ్చుకుంటుంటే.. మనసు ఉప్పొంగుతోందంటోంది కృష్ణమూర్తి తల్లి శకుంతల.

"మేము చదువుకోలేదు. కాబట్టి, మా కుమారుడు బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకున్నాం. కానీ, సరైన వేతనం ఇవ్వట్లేదని కోళ్ల వ్యాపారం చేస్తానన్నాడు. మేము చాలా బాధపడ్డాం. కోళ్ల కోసం గోనె సంచులు మోస్తూ, బస్సుల్లో ప్రయాణించిన నా కుమారుడిని చూసి దుఃఖం పొంగుకొచ్చేంది. దీనికి తోడు ఇరుగుపొరుగు వారు ఇంత చదివి ఈ పని చేస్తున్నాడేంటి అని దెప్పిపొడిచేవారు. కానీ, నా కొడుకు ఎదుగదలను చూసి ఇప్పుడు వారే మెచ్చుకుంటున్నారు. ఇది నా తనయుడి విజయం. ఇంకా మంచి వ్యాపారిగా పేరు తెచ్చుకోవాలి."

-శకుంతల మణి, కృష్ణమూర్తి తల్లి

ఇదీ చదవండి: ప్లాస్టిక్​లో జీవం పోసుకున్న 'నిలువెత్తు పచ్చదనం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.