ఒడిశా పూరీలో యాచకుడిగా మారిన ఇంజినీరు గిరిజా శంకర్ మిశ్రా కథ సుఖాంతమైంది. వార్తా కథనాలకు స్పందించిన కుటుంబ సభ్యులు శంకర్‌ను ఇంటికి తీసుకెళ్లారు.
మాజీ డీఎస్పీ కొడుకు గిరిజా శంకర్ మిశ్రా ఇంజినీరింగ్ పట్టభద్రుడు. కానీ, అనివార్య కారణాల వల్ల ఒడిశా పూరీజగన్నాథ స్వామి ఆలయం వద్ద యాచకుడిగా మారాడు. తాజాగా ఓ రిక్షా కార్మికుడితో శంకర్‌కు గొడవైంది. ఇద్దరిమధ్య బాహాబాహీ జరిగింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన శంకర్ చక్కటి ఇంగ్లీష్‌లో ఫిర్యాదు రాసిచ్చాడు. శంకర్ ఆంగ్ల భాష నైపుణ్యం చూసి కంగుతిన్న పోలీసులు.. అతడి గురించి ఆరా తీశారు. అప్పుడే శంకర్ అసలు కథ బయటపడింది.
ఆ తరువాతా వార్తా పత్రికలు, ఛానెళ్లు శంకర్ గురించి విస్తృతంగా కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్త చూసిన కుటుంబసభ్యులు వెంటనే వెళ్లి మిశ్రాను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భువనేశ్వర్, నీలాద్రి విహార్‌లోని తన స్వస్థలానికి చేరుకున్నాడు శంకర్.
ఇదీ చదవండి:మసీదులో అంగరంగ వైభవంగా హిందూ పెళ్లి