ETV Bharat / bharat

కాలుష్యంపై లోక్​సభలో చర్చ- ఆప్​ సర్కారుపై విమర్శలు - తాజావార్తలు దిల్లీ కాలుష్యం

దేశ రాజధాని దిల్లీని ఊపిరాడనీయకుండా చేస్తోన్న వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు అంశాలపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​లో పంట వ్యర్థాలు తగలబెడుతున్న సన్న, చిన్నకారు రైతులను నిందించడం తప్పని లోక్‌సభలో పలు పార్టీల ఎంపీలు అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్​ సర్కార్​పై వివిధ పార్టీలు విమర్శలు గుప్పించాయి.

కాలుష్యంపై లోక్​సభలో చర్చ- ఆప్​ సర్కారుపై విమర్శలు
author img

By

Published : Nov 19, 2019, 7:48 PM IST

పంట వ్యర్థాలను తగులబెట్టడం మంచి విషయం కానప్పటికీ.. దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి అదొక్కటే కారణం కాదని భాజపా, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేడీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. వాయుకాలుష్యం, వాతావరణ మార్పులపై లోక్​సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Don't vilify farmers for stubble burning: Cong, BJD, BJP members in LS
దిల్లీ వాయు కాలుష్యంపై లోక్​సభలో చర్చ

వాళ్లలా మనమెందుకు లేము...

వాయు కాలుష్యంపై చర్చలో ముందుగా కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ మాట్లాడారు. ఈ సమస్య ఒక్క దిల్లీకి మాత్రమే పరిమితం కాలేదని.. హిమాలయాల్లోని పలు నదులు, సరస్సులతో పాటు హిమనీనదాలు కూడా కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలో బీజింగ్‌ నుంచి మనం నేర్చుకోవాలన్నారు.

MANISH TIWARI
మనీశ్​ తివారీ, కాంగ్రెస్​ ఎంపీ

బీజింగ్‌లో వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించగలిగినప్పుడు మనం ఆ పనిని ఎందుకు చేయలేమని ప్రశ్నించారు మనీశ్​.

రూ.2 కోట్లు ఇవ్వండి..!

దిల్లీలో గాలిని శుద్ధి చేసే టవర్లు ఏర్పాటుకు ఒక్కొక్క ఎంపీ రూ.2 కోట్లు చొప్పున విరాళంగా ఇవ్వాలని భాజపా ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ కోరారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీరుపై మండిపడ్డారు. కాలుష్యానికి రైతులే కారణమనడం సరికాదన్నారు.

కాలుష్యంపై లోక్​సభలో చర్చ- ఆప్​ సర్కారుపై విమర్శలు

"దిల్లీ సర్కారు ఎలాంటి నియమాలను పాటించడం లేదు. దిల్లీలో ప్రజలపై చేసిన ఓ సర్వేలో... 36 శాతం మంది దేశ రాజధానిని వదిలి వెళ్లాలనుకుంటున్నారని తేలింది. కొద్ది రోజుల క్రితం దిల్లీ సీఎం.. ఓ పెద్ద ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ పిల్లలకు మాస్క్​లు పంచిపెట్టారు. అయితే ఈ మాస్క్​లు కాలుష్యాన్ని లోపలికి వెళ్లకుండా ఆపలేవని ఎయిమ్స్​ ఆసుపత్రి తెలిపింది. అయిదేళ్లలో దిల్లీలో వేల చెట్లను నరికివేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇది జరిగింది."
- పర్వేశ్​ సాహిబ్​ సింగ్​, భాజపా ఎంపీ

మాస్క్‌తో కకోలి ఘోష్‌...

kakoli ghosh
కకోలి ఘోష్​, టీఎమ్​సీ ఎంపీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కకోలి ఘోష్‌ ముఖానికి మాస్క్‌ ధరించే చర్చలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్​ తరహాలో దేశానికి 'స్వచ్ఛ గాలి' కార్యక్రమం అవసరమన్నారు.

New Delhi, Nov 19 (ANI): Customers are certainly not happy over the recent announcement by telecom giants Airtel and Vodafone Idea Limited (VIL). Crisis-ridden telecom majors have announced a raise in tariffs from next month in a bid to make their businesses viable as the government works out a solution after the recent Supreme Court judgement on definition of adjusted gross revenue. "I read about this in the news, they should not increase tariff charges and should provide better services," said a customer in Delhi. Speaking to ANI, a customer said, "I don't think this should be done, it will affect the users."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.