ETV Bharat / bharat

'మహా' లైవ్​: ఉమ్మడి పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ - FADNAVIS AS Maharashtra CM

లైవ్​: 'మహా' ప్రభుత్వ ఏర్పాటు- సీఎంగా దేవేంద్రుడి ప్రమాణం
author img

By

Published : Nov 23, 2019, 8:36 AM IST

Updated : Nov 23, 2019, 10:44 PM IST

22:43 November 23

3 పార్టీల పిటిషన్​పై రేపు సుప్రీం అత్యవసర విచారణ

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్​పై రేపు ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ 3 పార్టీలు అత్యవసర విచారణ కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించిన 3 పార్టీలు... బలపరీక్ష రేపే నిర్వహించేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. బలపరీక్షకు నవంబర్ 30 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు 3 పార్టీలు పిటిషన్​లో పేర్కొన్నాయి.

మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ​ తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ 3 పార్టీలు. పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి. తమ 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్​లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

21:45 November 23

అత్యవసర విచారణకు సుప్రీం అంగీకారం

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. శివసేన, కాంగ్రెస్​, ఎన్సీపీ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్​పై రేపు ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించిన 3 పార్టీలు... బలపరీక్ష రేపే నిర్వహించేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. 

19:56 November 23

ఎన్సీపీ ఎల్పీ నేతగా అజిత్ పవార్ తొలగింపు.. జయంత్​​ పాటిల్​ ఎంపిక

ఎన్సీపీకి ఊహించని షాక్ ఇచ్చిన అజిత్​ పవార్​ను శాసనసభ పక్షనేత పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. వైబీ చవాన్​ సెంటర్​లో జరుగుతున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జయంత్​ పాటిల్​ను ఎన్నుకున్నారు.

19:03 November 23

సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు

  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌
  • మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ పిటిషన్‌
  • ఫడణవీస్‌ను గవర్నర్‌ ఆహ్వానించడంపై 3 పార్టీల అభ్యంతరం
  • గవర్నర్​ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని శివసేన ఆరోపణ
  • తమ 3 పార్టీలకూ 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్‌లో వెల్లడి
  • ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని వినతి

18:57 November 23

  • Maharashtra: 42 NCP MLAs are present in the meeting with NCP Chief Sharad Pawar, at YB Chavan Centre in Mumbai; Visuals from outside YB Chavan Centre pic.twitter.com/hhRDKmTOY0

    — ANI (@ANI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శరద్​ పవార్​ వెంట 42 మంది ఎమ్మెల్యేలు..

  • శరద్​ పవార్​ ఏర్పాటు చేసిన ఎన్సీపీ శాసనసభ్యుల భేటీకి 42 మంది హాజరు
  • ముంబయి వైబీ చవాన్​ సెంటర్​లో జరిగిన ఈ భేటీలో 12 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు
  • మొత్తం ఎన్సీపీ ఎమ్మెల్యేలు 54 మంది

18:39 November 23

సుప్రీంకోర్టులో శివసేన రిట్​ పిటిషన్​...

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్, అజిత్​ పవార్​లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేసింది శివసేన. 

18:17 November 23

శివసేన ఎమ్మెల్యేలతో ముగిసిన ఠాక్రే భేటీ..

ముంబయిలోని లలిత్ హోటల్​లో శివసేన ఎమ్మెల్యేలతో ముగిసిన ఉద్ధవ్ ఠాక్రే భేటీ

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపై కొనసాగిన చర్చ..!

17:49 November 23

ఎన్సీపీ నేతలతో అజిత్ పవార్ భేటీ

  • ఎన్సీపీ కీలక నేతలతో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్... శ్రీినివాస్ పవార్​ నివాసంలో భేటీ అయ్యారు.
  • ఎంపీ సునీల్ తత్కరే, ఎమ్మెల్యేలు దిలిప్ పాటిల్, హసన్ ముష్రిఫ్​ చర్చిస్తున్న పవార్
  • శ్రీనివాస్ పవార్​ నివాసానికి భారీ భద్రత కల్పించిన పోలీసులు

17:08 November 23

మహాలో మళ్లీ మొదలైన క్యాంపు రాజకీయాలు..

  • మహారాష్ట్రలో మళ్లీ మొదలైన క్యాంపు రాజకీయాలు
  • 9 మంది శాసనసభ్యులను దిల్లీ పంపిన ఎన్‌సీపీ
  • తమ పార్టీ శాసనసభ్యులనూ తరలించే యోచనలో కాంగ్రెస్‌

16:46 November 23

  • Mumbai: Maharashtra Deputy CM Ajit Pawar is holding a meeting with NCP MP Sunil Tatkare and NCP MLAs Dilip Walse Patil and Hasan Mushrif at his brother Sriniwas Pawar's residence; Security has been heightened outside the residence of Sriniwas Pawar pic.twitter.com/KDzv2WOKpG

    — ANI (@ANI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భాజపా కార్యాలయానికి ఫడణవీస్​..

ముంబయిలో భాజపా కార్యాలయానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేరుకున్నారు.

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తాం: ఫడణవీస్

ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే: ఫడణవీస్

విజయానికి కారణమైన పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు: ఫడణవీస్

16:45 November 23

'స్నేహం వదిలి ఇతరులతో జట్టుకట్టడం సరైనదేనా? '

  • మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు క్లీన్ ఇమేజ్ ఉంది: రవిశంకర్‌ ప్రసాద్‌
  • కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది: కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
  • మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం ఏర్పాటు చేశాం: రవిశంకర్‌ ప్రసాద్‌
  • పదవి కోసం సేన-ఎన్సీపీ, కాంగ్రెస్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఎలా జరిగింది?: రవిశంకర్‌ ప్రసాద్‌
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఇప్పుడంటున్నారు: రవిశంకర్‌ ప్రసాద్‌
  • 30 ఏళ్ల స్నేహం వదిలి ఇతరులతో జట్టుకట్టడం ప్రజాస్వామ్య ఖూనీ కాదా?: రవిశంకర్ ప్రసాద్‌
  • ఆర్థిక రాజధాని ముంబయిని దొడ్డిదారిన ఆక్రమించుకునేందుకు యత్నించారు: రవిశంకర్‌ ప్రసాద్‌
  • బాల్‌ ఠాక్రే సిద్ధాంతాలు పాటించనివారి గురించి ఏం మాట్లాడతాం?: రవిశంకర్‌ ప్రసాద్‌
  • అధికారం కోసం రాజీపడేవాళ్లు శివాజీ గురించి మాట్లాడకపోవడం మంచిది: రవిశంకర్‌ ప్రసాద్‌
  • గవర్నర్‌ 3 పార్టీలనూ ఆహ్వానించారు: కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
  • తమ దగ్గర సంఖ్యాబలం లేదని భాజపా అప్పుడు చెప్పింది: రవిశంకర్‌ ప్రసాద్‌
  • మరింత సమయం కావాలని ఎన్సీపీ కోరింది: కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

16:40 November 23

మరికాసేపట్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ భేటీ

భాజపాతో తన మేనల్లుడు అజిత్ పవార్​ చేతులు కలిపిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వనున్నారు శరద్ పవార్. సాయంత్రం 4.30కు నేతలతో భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

తాజా ఎన్నికల్లో 54 స్థానాల్లో ఎన్సీపీ గెలుపొందింది. ప్రస్తుతం అజిత్ పవార్​తో కలిసి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు.

16:35 November 23

'ముంబయిని దొంగదారిలో నియంత్రించాలని కుట్ర'

ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిగా ఫడణవీస్​నే ప్రకటించామని..  ప్రజలు ఆదరించారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన సీఎం అభ్యర్థిగా ఉండటం వల్లనే శివసేన నేతలు విజయం సాధించారని చెప్పారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయితో కూడిన పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర అని... దొంగ దారిలో ముంబయిని నియంత్రించాలని ప్రయత్నించారని ఆరోపించారు ప్రసాద్​.

పూర్తిగా వ్యతిరేక భావాలు కలిగిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాయి: రవిశంకర్ ప్రసాద్

అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా మాత్రం అజిత్ పవార్​తో జతకట్టడం అన్యాయమా? రవిశంకర్ ప్రసాద్

రెండు పార్టీల శాసనసభ పక్షనేతలు సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు: రవిశంకర్ ప్రసాద్

16:03 November 23

ఎమ్మెల్యేల తరలింపు!

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేరే రాష్ట్రానికి తరలించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఉంచనుందని పేర్కొన్నాయి.

15:46 November 23

  • మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పిన భాజపా ఎంపీ భూపేంద్ర యాదవ్‌
  • కొన్నిరోజులుగా అజిత్‌ పవార్‌తో రహస్య చర్చలు జరుపుతున్న భూపేంద్ర యాదవ్‌
  • భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాకు నమ్మినబంటు
  • రాజస్థాన్‌కు చెందిన భూపేంద్ర యాదవ్‌ ప్రస్తుతం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
  • నిన్న రాత్రి 11.45 గం.కు భాజపా-అజిత్‌ పవార్‌ మధ్య కుదిరిన ఒప్పందం
  • సేన-ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలకు తెలిసేలోగా ప్రమాణస్వీకారం జరిగేలా చూడాలన్న ఫడణవీస్
  • రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని రాత్రి 2.10 గం.కు గవర్నర్‌ కార్యదర్శి నుంచి సందేశం
  • ఉదయం 5.30 గంటలకే రాజ్‌భవన్‌ చేరుకున్న దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌
  • ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు
  • ఉదయం 7.50 గం.కు ఫడణవీస్‌, అజిత్‌తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ కోశ్యారీ

15:13 November 23

క్రికెట్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యం...

మహారాష్ట్రలో భాజపా-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ స్పందించారు. క్రికెట్​ ఆటలో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని కొద్ది రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. అలా ఎందుకు అన్నానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని చెప్పారు గడ్కరీ.

15:03 November 23

అప్రజాస్వామికం: కాంగ్రెస్​

  • గవర్నర్‌ ఉదయమే హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు: కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌
  • ఈతరహా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: అహ్మద్‌ పటేల్‌
  • రాజ్యాంగాన్ని గవర్నర్‌ అపహాస్యం చేశారు: అహ్మద్‌ పటేల్‌
  • ఉద్ధవ్ ఠాక్రేతో సోనియాగాంధీ ఫోన్‌లో మాట్లాడారు: అహ్మద్‌ పటేల్‌
  • మరోసారి సమావేశమై అన్ని అంశాలు చర్చిస్తాం: అహ్మద్ పటేల్
  • మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు: అహ్మద్ పటేల్
  • ఇప్పటికే శివసేనతో వివిధ అంశాలపై పలుమార్లు చర్చించాం: అహ్మద్ పటేల్
  • కాంగ్రెస్‌ వైపు నుంచి మేం ఎలాంటి ఆలస్యం చేయలేదు: అహ్మద్ పటేల్
  • భాజపా ప్రభుత్వం బలపరీక్ష నెగ్గకుండా అన్ని ప్రయత్నాలు చేస్తాం: అహ్మద్‌ పటేల్‌
  • మూడు పార్టీల మధ్య బంధం గట్టిగానే ఉంది.. ఎలాంటి గందరగోళం లేదు: అహ్మద్‌ పటేల్‌

15:03 November 23

ఠాక్రే స్పందన

  • ప్రజాస్వామ్యాన్ని భాజపా అపహాస్యం చేసింది: ఉద్ధవ్‌ ఠాక్రే
  • ప్రజాతీర్పును అవమానించారని మాపై ఆరోపణలు చేస్తున్నారు: ఉద్ధవ్‌ ఠాక్రే
  • పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్ తరహా మహారాష్ట్రలో చేశారు: ఉద్ధవ్‌ ఠాక్రే

14:51 November 23

సేన, ఎన్సీపీ సంయుక్త సమావేశం..

ఎన్‌సీపీ, శివసేన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించినట్లు శరద్ పవార్ తెలిపారు. మూడు పార్టీలకు ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కలిపి దాదాపు 170 వరకు సంఖ్యా బలం  ఉందని చెప్పారు.

అజిత్‌ పవార్‌ నిర్ణయంతో ఎన్సీపీలో ఎవరూ సంతోషంగా లేరని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.భాజపాతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీలో ఏ ఒక్కరూ ఎన్‌సీపీ-భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా లేరన్నారు.

13:50 November 23

అజిత్ పవార్​ తొలగింపు...

ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా అజిత్​ పవార్​ను తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతు ఆయన వ్యక్తిగత విషయమని ఇప్పటికే తేల్చిచెప్పింది.

13:09 November 23

మూడు పార్టీల మీడియా సమావేశం..

కాంగ్రెస్​, ఎన్సీపీ, శివసేన మరికాసేపట్లో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొంటాయి. మహారాష్ట్రలో తాజా పరిణామాలపై సంయుక్త ప్రకటన చేసే అవకాశముంది. 

12:43 November 23

'రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు'

రాజ్యాంగాన్ని భాజపా అపహాస్యం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్. గోవా, మేఘాలయ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ ఇలాగే చేసిందని విమర్శించారు. భాజపాకు మద్దతుగా అజిత్​ పవార్​ ఒక్కరే ఉన్నారని.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆయనతో లేరని చెప్పారు దిగ్విజయ్​.

12:07 November 23

సంతాకాల దుర్వినియోగం..

హాజరు కోసం తీసుకున్న  ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలను దుర్వినియోగం చేశారని ఆ పార్టీ సీనియర్​ నేత నవాబ్ మాలిక్​ తెలిపారు. ఆ సంతకాలను ప్రమాణస్వీకారం కోసం వాడుకున్నారన్నారు. ఇది మోసపూరితంగా ఏర్పడిన ప్రభుత్వమని ఆరోపించారు మాలిక్​. ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారాని స్పష్టం చేశారు. బలనిరూపణ పరీక్షలో భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

12:04 November 23

ఎన్సీపీ పార్టీ, పవార్​ కుటుంబ సభ్యుల మధ్య చీలికలు ఏర్పడినట్లు శరద్​ పవార్​ కుమార్తే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ధ్రువీకరించారు. ఆమె వాట్సాప్​ స్టేటస్​ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

11:55 November 23

  • Digvijaya Singh,Congress: This is making a mockery of the constitution, BJP did the same in Goa,Meghalaya and other states. No MLA of the NCP will support this, Ajit Pawar has gone with them alone pic.twitter.com/W77zVoSStE

    — ANI (@ANI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎమ్మెల్యేలతో భేటికానున్న పవార్

మహారాష్ట్రలో పరిణామాలపై చర్చించేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఈరోజు సాయంత్రం 4:30గంటలకు సమావేశం కానున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు శరద్​ పవార్.

11:30 November 23

కాంగ్రెస్ స్పందన..

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్​పై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ప్రజల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

11:20 November 23

కాంగ్రెస్ అత్యవసర సమావేశం..

మహారాష్ట్రలో తాజా పరిణామాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్. ముంబయిలోని పార్టీ కార్యాలయంలో జరిగే ఈ భేటీకి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, కే సీ వేణుగోపాల్ హాజరుకానున్నారు.

11:15 November 23

'మహా వెన్నుపోటు'

మహారాష్ట్రలో ప్రస్తుత పరిణామాలపై శివసేన స్పందించింది. మహారాష్ట్ర ప్రజలను అజిత్​ పవార్​ వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సేన నేత సంజయ్ రౌత్​. ధనబలంతో భాజపా అధికారం చేపట్టిందని ఆరోపించారు. అజిత్ నిర్ణయంతో శరద్‌ పవార్‌కు సంబంధం లేదన్నారు. నిన్న రాత్రి 9గంటల వరకు అజిత్‌పవార్‌ తమతోనే ఉన్నారని... ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమైపోయారని చెప్పారు రౌత్​. ఈరోజు పరిణామాలు చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు.

10:50 November 23

శరద్ పవార్ స్పందన...

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పరిణామాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. భాజపాకు మద్దతు అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అజిత్ నిర్ణయాన్ని సమర్థించబోమని ట్వీట్​ చేశారు.

10:43 November 23

శరద్ పవార్ స్పందన...

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పరిణామాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. భాజపాకు మద్దతు అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అజిత్ నిర్ణయాన్ని సమర్థించబోమని ట్వీట్​ చేశారు.

10:05 November 23

  • #WATCH Sanjay Raut, Shiv Sena: Kal 9 baje tak ye mahashaye (Ajit Pawar) hamare saath baithe the, achanak se gayab ho gaye baad mein. Vo nazro se nazre mila kar nahi bol rahe the, jo vyakti paap karne jata hai uski nazar jaise jhukti hai, waise jhuki nazro se baat kar rahe the. pic.twitter.com/dL6olqXFK9

    — ANI (@ANI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫడణవీస్​ ధన్యవాదాలు..

మహారాష్ట్ర సీఎంగా రెండోసారి అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు దేవేంద్ర ఫడణవీస్​. ప్రజలు భాజపా-శివసేనక కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా... ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సేన ప్రయత్నించిందని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఎన్సీపీతో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు ఫడణవీస్​.

10:02 November 23

అమిత్ షా ట్వీట్​...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్​, అజిత్​ పవార్​లకు శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. మహారాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నమ్మకముందని ట్వీట్​ చేశారు. మహారాష్ట్ర ప్రగతిలో నవశకం ప్రారంభమైందన్నారు.

08:54 November 23

  • Ajit Pawar's decision to support the BJP to form the Maharashtra Government is his personal decision and not that of the Nationalist Congress Party (NCP).
    We place on record that we do not support or endorse this decision of his.

    — Sharad Pawar (@PawarSpeaks) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ శుభాకాంక్షలు...

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన ఫడణవీస్​, అజిత్ పవార్​లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

08:47 November 23

  • श्री @Dev_Fadnavis जी को महाराष्ट्र के मुख्यमंत्री और श्री @AjitPawarSpeaks को प्रदेश के उपमुख्यमंत्री के रूप में शपथ लेने पर हार्दिक बधाई।

    मुझे विश्वास है कि यह सरकार महाराष्ट्र के विकास और कल्याण के प्रति निरंतर कटिबद्ध रहेगी और प्रदेश में प्रगति के नये मापदंड स्थापित करेगी।

    — Amit Shah (@AmitShah) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మహా' ప్రభుత్వ ఏర్పాటు- సీఎంగా దేవేంద్రుడి ప్రమాణం...

  • మహా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
  • మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం
  • డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం
     

08:43 November 23

  • Congratulations to @Dev_Fadnavis Ji and @AjitPawarSpeaks Ji on taking oath as the CM and Deputy CM of Maharashtra respectively. I am confident they will work diligently for the bright future of Maharashtra.

    — Narendra Modi (@narendramodi) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మహా' ప్రభుత్వ ఏర్పాటు- సీఎంగా దేవేంద్రుడి ప్రమాణం...

  • మహా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
  • మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం
  • డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం
     

08:38 November 23

'మహా' ప్రభుత్వ ఏర్పాటు- సీఎంగా దేవేంద్రుడి ప్రమాణం...

  • మహా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
  • మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం
  • డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం
     

08:14 November 23

'మహా' ప్రభుత్వ ఏర్పాటు- సీఎంగా దేవేంద్రుడి ప్రమాణం...

  • మహా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
  • మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం
  • డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం
     
New Delhi, Nov 23 (ANI): Parineeti Chopra on Friday received an official invitation from Australian Cricket Board to attend the upcoming ICC Women's T20 World Cup. The actor shared the exciting news on her Twitter handle. "Australia invites you to be a spectator of the spectacular - On the field and off it. #T20WorldCup in Australia #LedByWomen #seeaustralia," she wrote alongside her snap. The final of the tournament will be played at the Melbourne Cricket Ground (MCG), on March 8, which is marked as International Women's Day. Meanwhile, on the work front, Parineeti is busy shooting for the upcoming film based on the badminton player Saina Nehwal. The actor also recently suffered an injury while shooting for the film.
Last Updated : Nov 23, 2019, 10:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.