ETV Bharat / bharat

ఊహించని మలుపు.. మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

author img

By

Published : Nov 23, 2019, 8:14 AM IST

Updated : Nov 23, 2019, 9:58 AM IST

మహా మలుపు: సీఎంగా ఫడణవీస్​ ప్రమాణస్వీకారం

08:08 November 23

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఊహించని మలుపు తిరిగింది. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్​ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్​ ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్ కోశ్యారీ వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు.

మహారాష్ట్ర ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే భాజపాతో కలిసినట్లు అజిత్​ పవార్ తెలిపారు.

శివసేన, కాంగ్రెస్​, ఎన్సీపీ  ఈ రోజు భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేస్తాయని అందరూ భావిస్తున్న తరుణంలో రాత్రికిరాత్రే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య  మార్పులు జరిగాయి.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా, ఎన్సీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు శరద్ పవార్ భేటీ అయ్యారు.

పవార్​ అంగీకారంతోనే...

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్ అంగీకారంతోనే భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ప్రమేయం  లేకుండా ఎన్సీపీ ఏ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశాయి.

ఫడణవీస్​ ధన్యవాదాలు..

మహారాష్ట్ర సీఎంగా రెండోసారి అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు దేవేంద్ర ఫడణవీస్​. ప్రజలు భాజపా-శివసేనక కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా... ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రయత్నించిందని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఎన్సీపీతో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు ఫడణవీస్​.

మోదీ శుభాకాంక్షలు...

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన ఫడణవీస్​, అజిత్ పవార్​లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

అమిత్ షా ట్వీట్​...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్​, అజిత్​ పవార్​లకు శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. మహారాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నమ్మకముందని ట్వీట్​ చేశారు. మహారాష్ట్ర ప్రగతిలో నవశకం ప్రారంభమైందన్నారు.

New Delhi, Nov 23 (ANI): Scientists at Scripps Research have come up with an unexpected finding of a protein that is highly expressed in fat tissue. The study has opened the door to critical new understandings about obesity, metabolism and potentially other diseases. The results of the study were published in the Journal Nature. The signalling protein, known as PGRMC2, had not been extensively studied in the past. Short for "progesterone receptor membrane component 2," it had been detected in the uterus, liver and several areas of the body. The team built on their recent discovery that PGRMC2 binds to and releases an essential molecule called heme. Recently in the spotlight for its role in providing flavour to the plant-based Impossible Burger, heme holds a much more significant role in the body.
Last Updated : Nov 23, 2019, 9:58 AM IST

For All Latest Updates

TAGGED:

CM FADNAVIS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.