దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యుర్థుల్లో 133 మంది (20 శాతం) నేరచరితులేనని తేలింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంఖ్య 114 (17 శాతం)గా ఉంది. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు సమర్పించిన ప్రమాణపత్రాల ఆధారంగా 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్' ఈ విషయం వెల్లడించింది.
గరిష్ఠంగా ఆమ్ఆద్మీకి చెందిన 25 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. 20 శాతం మంది భాజపా, 15 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులపైనా ఇలాంటి నేరాలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. అత్యంత ధనికులైన మొదటి ముగ్గురు అభ్యర్థులు ఆమ్ఆద్మీకి చెందిన వారే కావడం గమనార్హం.
ఈ ఎన్నికల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 32 మంది.. మహిళలపై నేరాలు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఒకరిపై అత్యాచార కేసు ఉంది. నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 8 మంది విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.
- ఇదీ చూడండి: ప్రధాని మోదీ భద్రతకు బడ్జెట్లో రూ.600 కోట్లు