దిల్లీ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం.. పరిహారం ప్రకటన - దిల్లీ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం.. పరిహారం ప్రకటన
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలను అందిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
దిల్లీ ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీ వద్ద బహుళ అంతస్తుల భవనంలో ఉన్న ఫ్యాక్టరీలో తలెత్తిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలన్నారు. పదుల సంఖ్యలో మృతి చెందిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. అనంతరం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పరిహారంపై ప్రకటన
దిల్లీ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
బాధిత కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'
Sunday, 8 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2303: Australia Wildfires Helicopter No access Australia 4243620
Pilot OK after Australia wildfire helicopter crash
AP-APTN-2258: Italy Christmas Tree Part must credit 4243619
Lights on world's 'largest' Xmas tree switched on
AP-APTN-2241: Syria Airstrike AP Clients Only 4243618
At least 18 dead in airstrikes in northwest Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
TAGGED:
delhi fire probe