ETV Bharat / bharat

'నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరి - Nirbhaya case

SpaceX successfully launched 60 mini internet satellites with the mission to provide high-speed, reliable internet service around the world. However, concerns over these satellites contributing to reduce darkness in space persist.

NIRBHAYA
నిర్భయ తీర్పు
author img

By

Published : Jan 7, 2020, 4:48 PM IST

Updated : Jan 7, 2020, 5:40 PM IST

17:39 January 07

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది. ఈనెల 22 ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. దిల్లీ తిహార్​ జైలులో ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దోషులకు సత్వరమే శిక్ష అమలుచేయాలన్న నిర్భయ తల్లిదండ్రుల అభ్యర్థనతో పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి సతీశ్​ కుమార్​ అరోడా ఈమేరకు ఉత్తర్వులు వెలువరించారు. ఉరిశిక్షను ఆపేందుకు ఏమైనా న్యాయపరమైన అవకాశాలు ఉంటే దోషులు వాటిని 14 రోజుల్లోగా ఉపయోగించుకోవాలని సూచించారు.

కేసు విచారణ సమయంలో దోషులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా  జైలు అధికారులు హాజరుపరిచారు. 

నాటకీయ పరిణామాలు...

విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. వీడియో లింక్​ ద్వారా న్యాయమూర్తితో మాట్లాడిన దోషులు కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. 

న్యాయపరంగా ఇంకా అవకాశాలు ఉన్నాయని దోషుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ల దాఖలు ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. దోషి ముఖేశ్​ తరఫున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు జైలు అధికారుల నుంచి మరికొన్ని పత్రాలు రావాల్సి ఉందని తరఫు న్యాయవాది బృందా గ్రోవర్  తెలిపారు. దోషుల మానసిక ఆరోగ్య స్థితిపైనా నివేదిక తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ఈ వాదనల్ని నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. క్యూరేటివ్, క్షమాభిక్ష  పిటిషన్లకు అవకాశం ఉన్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చన్నారు. క్యూరేటివ్ పిటిషన్​కు అవకాశం ఉందని డెత్ వారెంట్ జారీని నిలుపుదల చేయకూడదన్నారు.

నిర్భయ తల్లి హర్షం...

కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చట్టాలు, న్యాయస్థానాలపై మహిళలకు ప్రగాఢమైన నమ్మకాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. 

ఉరిశిక్షను ఆపేందుకు సుప్రీంకోర్టులో క్యూరేటివ్​ పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

కేసు పుర్వాపరాలు...

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన దోషులైన ముఖేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. దీనినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

17:01 January 07

నిర్భయ తల్లి హర్షం

నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేసేందుకు మార్గం సుగమం కావడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తంచేశారు. నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని అన్నారు. మరణశిక్ష తీర్పు అమలుతో దేశంలోని మహిళలు మరింత సాధికారులు అవుతారని, న్యాయవ్యవస్థపై ప్రజావిశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

16:53 January 07

సుప్రీంకోర్టుకు వెళ్లనున్న దోషులు...

ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ కేసు దోషులు ఆఖరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్​ తెలిపారు.

15:32 January 07

'నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' సామూహిక అత్యాచార కేసు దోషులకు ఉరిశిక్ష విధించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు దిల్లీ తిహార్​ జైలులో నలుగురు దోషులకు మరణశిక్ష విధించనున్నారు. దిల్లీ కోర్టు ఈమేరకు డెత్​ వారెంట్​ జారీ చేసింది. 

Intro:Body:Conclusion:
Last Updated : Jan 7, 2020, 5:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.