ETV Bharat / bharat

నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా? - నిర్భయ కేసు విచారణ

నిర్భయ కేసు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది దిల్లీ కోర్టు. మరోవైపు నిందితుల్లో ఒకడైన అక్షయ్​ కుమార్​ రివ్యూ పిటిషన్​ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి సుప్రీంను ఆశ్రయించారు.

NIRBHAYA CASE
నిర్భయ అత్యాచార ఘటన
author img

By

Published : Dec 13, 2019, 11:42 AM IST

Updated : Dec 13, 2019, 1:54 PM IST

సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు వెంటనే డెత్​ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్లులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను దిల్లీ కోర్టు వాయిదా వేసింది. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్​ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న విచారణకు రానుండటమే ఇందుకు కారణం.

"సుప్రీం కోర్టులో నిందుతుడి రివ్యూ పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున అప్పటివరకు వేచి చూడాలని నేను భావిస్తున్నా. అందుకే పిటిషన్​పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నాను." - సతీశ్ కుమార్​ అరోడా, దిల్లీ పటియాలా హౌస్ కోర్టు జడ్జి

ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, మరో వారం రోజులు ఎదురుచూస్తామని.. వాయిదా వేసిన అనంతరం నిర్భయ తల్లి మీడియాతో అన్నారు.

సుప్రీం చెంతకు...

నిర్భయ కేసుపై 2017లో సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరిన అక్షయ్​ కుమార్​ పిటిషన్​ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి సుప్రీంను ఆశ్రయించారు. ​ ఈ నెల 17న విచారణకు రానున్న నిందితుడి రివ్యూ పిటిషన్​ను వ్యతిరేకిస్తున్నట్లు.. సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు.

అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం నిందితుడి రివ్యూ పిటిషన్​తో పాటే.. నిర్భయ తల్లి అభ్యర్థన వ్యాజ్యాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.

Surat (Gujarat), Dec 13 (ANI): Thousands of migratory birds gathered in Gujarat's Surat to spend their winters. The birds have come from Northern Asia. People were seen feeding the birds in the city. These birds are attracting people. Bird lovers were also seen taking pictures with the migratory birds.
Last Updated : Dec 13, 2019, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.