దిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ట్రైన్ సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్‌కు ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
"2022 నాటికి విమానాశ్రయంలో జరుగుతున్న విస్తరణ పనులు పూర్తవుతాయి. అప్పటికి దిల్లీ విమానాశ్రయంలో రద్దీ ఏటా 10 కోట్లకు చేరనుంది. అందువల్ల 2022 నుంచి ఎయిర్ట్రైన్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాం."
-విమానాశ్రయ అధికార వర్గాలు
ప్రస్తుతం టెర్మినళ్ల మధ్య ప్రయాణానికి బస్సు సర్వీసులను వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి: భారత దేశ ప్రజలమైన మేము...