కేరళను 'మహా' తుపాను భయపెడుతోంది. తుపాను ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా
భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా.. కేరళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. రైలు, రోడ్డు రవాణా పాక్షికంగా స్తంభించింది. కొచ్చి తీరం సమీపంలో మత్స్యకారులకు చెందిన 10 పడవలు ధ్వంసమయ్యాయి.
సముద్రం అల్లకల్లోలంగా మారుతున్న దృష్ట్యా అంతా అప్రమత్తమయ్యారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు వాయిదా వేశారు. తుపాను హెచ్చరికలతో కొచ్చిలోని ఎడవనాక్కడ్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే సమీపంలోని 62 కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు.
నిలిచిపోయిన సేవలు...
అలప్పుజ, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ (తీవ్ర ప్రమాద హెచ్చరిక) ప్రకటించింది వాతావరణ శాఖ. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, కొట్టాయం నాలుగు జిల్లాల్లోనూ ఎల్లో అలర్ట్(ప్రమాద హెచ్చరిక)లు జారీ చేసింది.
ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలని, చెట్ల కింద వాహనాలను నిలుపవద్దని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చూడండి:ఎన్టీఆర్ పక్కన సీతగా.. ఎంజీఆర్ సోదరిగా