ETV Bharat / bharat

'సుదీర్ఘ తీర్పు కాదు.. స్పష్టత ముఖ్యం' - Courts have certain limits on Intemediate Tribunal verdict says justice NV Ramana

మధ్యవర్తిత్వ ట్రైబ్యునళ్ల తీర్పులు సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదని జస్టిస్​ ఎన్​వి రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. క్లుప్తంగా అయినప్పటికీ, స్పష్టంగా ఉండాలని సూచించింది. ట్రైబ్యునళ్ల తీర్పులు అర్థవంతంగా ఉన్నప్పుడు.. కారణాలు పేర్కొనలేదంటూ జోక్యం చేసుకోరాదని కోర్టులకు హితవు పలికింది.

Courts have certain limits on Intemediate Tribunal verdict says justice NV Ramana
'సుదీర్ఘ తీర్పు కాదు.. స్పష్టత ముఖ్యం'
author img

By

Published : Dec 19, 2019, 6:14 AM IST

Updated : Dec 19, 2019, 7:04 AM IST

వివాదాలను పరిష్కరిస్తూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్‌) ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పులు సహేతుకంగా, స్పష్టంగా ఉండాలని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్‌-31(3) ప్రకారం అవార్డు జారీ చేయని పక్షంలో సెక్షన్‌-34 కింద జోక్యం చేసుకుని వాటిని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుందని పేర్కొంది. స్పష్టమైన కారణాలున్నప్పుడు.. సంక్షిప్త తీర్పులు ఇచ్చే అవకాశం మధ్యవర్తిత్వ ట్రైబ్యునళ్లకు ఉందని తెలిపింది. తద్వారా సమయం వృథా కాకుండా చూడొచ్చని వెల్లడించింది. అయితే, ట్రైబ్యునళ్లు రికార్డులన్నింటినీ చదవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమని సూచించింది. డైనా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ లిమిటెడ్‌ కేసులో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ శాంతన గౌడర్‌లతో కూడిన ధర్మాసనం విప్లవాత్మక తీర్పు వెలువరిస్తూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సుదీర్ఘ తీర్పు అవసరం లేదు

ట్రైబ్యునళ్ల తీర్పులు సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. క్లుప్తంగా అయినప్పటికీ, స్పష్టంగా ఉండాలని సూచించింది. ట్రైబ్యునళ్ల తీర్పులు అర్థవంతంగా ఉన్నప్పుడు.. కారణాలు పేర్కొనలేదంటూ జోక్యం చేసుకోరాదని కోర్టులకు హితవు పలికింది. డైనా టెక్నాలజీస్‌ దాఖలు చేసిన సివిల్‌ అపీలులో సహేతుకత, స్పష్టత లేకుండా గజిబిజిగా ఉన్న మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. ట్రైబ్యునళ్ల అవార్డుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌లో కేసు కోల్పోయిన వ్యక్తి తిరిగి కోర్టు ముందు కేసు పూర్వాపరాలపై వాదించడం అనైతిక చర్య అని ధర్మాసనం అభిప్రాయపడింది.

కారణాలు లేవని రద్దు చేయొద్దు

ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికి సెక్షన్‌-34 కింద కొన్ని పరిమితులున్నాయని తెలిపింది. సరైన కారణాలు పేర్కొనకపోవడం కూడా అందులో ఒకటంది. తీర్పుల్లో గందరగోళం, అస్పష్టత లేకపోయినా.. సరైన కారణాలు లేవని పేర్కొంటూ వాటిని రద్దు చేయొద్దని కోర్టులకు గుర్తుచేసింది. రొయ్యల చెరువు తవ్వక ఒప్పందం కుదుర్చుకొని మధ్యలో రద్దు చేసుకోవడంతో డైనా టెక్నాలజీస్‌కు రూ.30 లక్షలను 8 వారాల్లో చెల్లించాలంటూ క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ లిమిటెడ్‌ను ఆదేశిస్తూ 25 ఏళ్ల వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. గడవులోగా చెల్లించకపోతే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT WXYZ, NO ACCESS DETROIT, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
SHOTLIST:
WXYZ - MUST CREDIT WXYZ, NO ACCESS DETROIT, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
Detroit - 18 December 2019
++SOUNDBITES SEPARATED BY BLACK++
1. SOUNDBITE (English) William Barr, Attorney General:
"We're calling it Operation Relentless Pursuit, and it's a two-pronged attack on violent crime. First, we're going to be increasing federal agents, analysts and equipment into, initially, a group of 7 cities throughout the country. And second, we're gonna provide substantial resources to the state and local law enforcement."
2. SOUNDBITE (English) William Barr, Attorney General:
"Since the beginning of this administration, violent crime rates across the county on average have dropped from 2000...and that was after an increase that had occurred between 2014 and 2016."
3. SOUNDBITE (English) William Barr, Attorney General:
"To address the problem of violent crime levels in some of our major cities, we are deploying these resources under Relentless Pursuit to 7 cities. Detroit, which still unfortunately has the highest violent crime and aggravated assault rate in the country."
4. SOUNDBITE (English) William Barr, Attorney General:
"The FBI through, with Director (Christopher) Wray here, will through their Safe Street task forces and their other efforts conduct long-term and proactive investigations of sophisticated and violent criminal enterprises, including gangs and other criminal organizations."
STORYLINE:
The Justice Department is launching a crackdown aimed at driving down crime in seven of the nation's most violent cities.
Attorney General William Barr announced the initiative known as Operation Relentless Pursuit at a news conference in Detroit on Wednesday.
The Justice Department will intensify federal law enforcement resources in the seven cities with violent crime rates high above the national average. They are: Detroit, Albuquerque, Baltimore, Cleveland, Kansas City, Memphis and Milwaukee.
The agency is also committing up to $71 million in federal grant funds that can help fund the local task forces.
Leaders of the FBI, the Drug Enforcement Administration, the Bureau of Alcohol, Tobacco, Firearms and Explosives, and the U.S. Marshals Service also attended the news conference.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 19, 2019, 7:04 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.