ETV Bharat / bharat

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం - సుప్రీం కోర్టు తాజా వార్తలు

పౌరసత్వ చట్టాన్ని రాజ్యాంగబద్ధమని ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. చట్టం చెల్లుబాటును పరిశీలించటమే న్యాయస్థానాల విధి అని పేర్కొంది. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో పిటిషన్లు శాంతి నెలకొల్పేలా ఉండాలని వ్యాఖ్యానించింది.

Country going through difficult times
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం
author img

By

Published : Jan 9, 2020, 4:18 PM IST

Updated : Jan 9, 2020, 5:24 PM IST

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం

పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తప్పుబట్టారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు సుప్రీం కోర్టులో దాఖలయ్యే పిటిషన్లు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగానీ, రాజ్యాంగ చట్టబద్ధతను అనుమానించేవిగా ఉండకూడదని హితవు పలికారు. ఇలాంటి పిటిషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని అన్నారు.

సీఏఏని రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకంటించి, అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ వినీత్‌ ధండా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణకు జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పౌరసత్వ చట్టంపై దేశంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. చట్టం చెల్లుబాటును నిర్ధరించడం కోర్టు విధి అని, అంతేగానీ అది రాజ్యాంగబద్ధమైందని తాము ప్రకటించలేమని ధర్మాసనం పేర్కొంది.

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్‌లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి డిసెంబరు 2019లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ చట్టంతో ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని ప్రభుత్వం చెబుతూనే ఉంది.

Ashok Nagar (MP), Jan 09 (ANI): Dalit man was brutally thrashed by a mob in Madhya Pradesh's Ashok Nagar on Jan 08. He was beaten black and blue with rod and stick. The video surfaced on social media. Police registered FIR against 2 miscreants under SC/ST Act. Further investigation is underway.
Last Updated : Jan 9, 2020, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.