పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం సత్యాగ్రహ ధర్నా చేపట్టనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మౌన దీక్ష చేపట్టనున్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సత్యాగ్రహ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువుపు ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: నిరసనల నడుమ నేడు ప్రధాని మోదీ బహిరంగ సభ