కాంగ్రెస్ 134వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు శనివారం... దేశవ్యాప్తంగా జరుపుకోనున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ... దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరిస్తారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలోని గువాహటిలో నిర్వహించే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖ్‌నవూలో ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతారు.
'జెండా ఎగరేయండి..'
ఆయా రాష్టాల రాజధానుల్లో ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించాలని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 'రాజ్యాంగాన్ని రక్షించండి- భారత్‌ను రక్షించండి' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశాల్లో తమ తమ భాషల్లో రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని చదివి వివరించాలన్నారు.