ETV Bharat / bharat

'పౌరచట్టం, ఎన్​ఆర్​సీలతో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు' - జాతీయ పౌర జాబిత

పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ) దేశంలోని ముస్లింలకు నష్టం కలుగజేయవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సీఏఏపై చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు వివక్షపూరితంగా ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదన్నారు.

Modi
'పౌరచట్టం, ఎన్​ఆర్​సీలతో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు'
author img

By

Published : Dec 22, 2019, 3:36 PM IST

పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతోన్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పౌర చట్టంపై ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఏ ఒక్క పథకము మతప్రాతిపదికన వివక్ష చూపబోదని స్పష్టం చేశారు.

రామ్​లీలా మైదానంలో దిల్లీ అనధికార కాలనీవాసుల యజమాన్య హక్కుల కల్పనపై ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కాంగ్రెస్​, ఇతర పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనే అసత్యాలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ధైర్యముంటే ప్రభుత్వం చేపట్టే పనుల్లో వివక్షను గుర్తించాలని సవాలు విసిరారు.

ఎన్నికల్లో తనను సవాలు చేయలేక, తన ప్రత్యర్థులు పుకార్లు వ్యాప్తి చేస్తూ.. దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

" పౌరసత్వ చట్ట సవరణ భారత్​లోని హిందువులు, ముస్లింలు, ఏ మతానికి సంబంధించిన సంస్కృతిని నాశనం చేయదు. ఇదే విషయం పార్లమెంటులో స్పష్టం చేశాం. పార్లమెంటులో అసత్యాలు పలకకూడదు. దేశంలోని 130 కోట్ల మందికి ఈ చట్టం ఎలాంటి హాని తలపెట్టదు. అంతకు ముందు ఎన్​ఆర్​సీపై భారీగా అసత్య ప్రచారాలు చేశారు. అది కాంగ్రెస్​ హయాంలోనే రూపొందించారు. ఆ విషయం మీకు గుర్తుందా. మేము రూపొందించలేదు. పార్లమెంటు ముందుకు రాలేదు. కేబినెట్​ ముందుకు రాలేదు. హిందుస్థాన్​ భూభాగంలో ఉన్న ముస్లింలంతా భారతమాత బిడ్డలే. వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా ఏ చట్టాన్ని, ఎన్​ఆర్​సీని తీసుకురాలేదు. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: 'ఆప్'​ సంపన్నుల పక్షం... భాజపా పేదల పక్షం: మోదీ

New Delhi, Dec 22 (ANI): Congress senior leader Ghulam Nabi Azad hit out at Uttar Pradesh Chief Minister Yogi Adityanath over rising death toll in the state during protests against the Citizenship Amendment Act (CAA). He said, "The Chief Minister of the state is responsible for this. The Chief Minister has asked police administration to heavily clamp down on students."He further added that if the central government is not bringing National Register of Citizens (NRC) may be, then there is no problem with CAA.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.