ETV Bharat / bharat

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం - పార్లమెంటు ముందుకు వివాదస్పద బిల్లు

Citizenship Amendment Bill
నిరసనల నడుమ పార్లమెంటు ముందుకు పౌరసత్వ బిల్లు
author img

By

Published : Dec 9, 2019, 11:56 AM IST

Updated : Dec 10, 2019, 12:18 AM IST

00:13 December 10

మోదీ కృతజ్ఞతలు..

సుదీర్ఘ చర్చ తర్వాత పౌరసత్వ సవరణ బిల్లును లోక్​సభ ఆమోదంచిందని హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు శతాబ్దాల మానవతా విలువలకు అనుగుణంగా ఉందన్నారు.

00:07 December 10

  • PM Narendra Modi: I would like to specially applaud Home Minister Amit Shah Ji for lucidly explaining all aspects of the Citizenship (Amendment) Bill, 2019. He also gave elaborate answers to the various points raised by respective MPs during the discussion in the Lok Sabha. https://t.co/6MOgwbzxuY

    — ANI (@ANI) December 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు నమోదయ్యాయి. వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి.

23:53 December 09

ఓటింగ్ ప్రారంభం

పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. విభజన ఓటు ద్వారా ఓటింగ్​ను చేపడుతున్నారు స్పీకర్ ఓం బిర్లా.

23:22 December 09

  • రోహింగ్యాలకు దేశంలో అనుమతి లేదు: అమిత్‌షా
  • బెంగాలీ హిందువులు దేశానికి రావడం మీకు ఇష్టం లేదా?: అమిత్‌ షా
  • శరణార్థుల గుర్తింపునకు ప్రామాణికాలు ఉంటాయి: అమిత్‌ షా
  • ఈ బిల్లు వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు: అమిత్‌ షా
  • దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తాం: అమిత్‌ షా
  • అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌ ఐఎల్‌పీ భద్రత ఉంటుంది: అమిత్‌ షా

23:22 December 09

  • పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
  • ఈ బిల్లు ఆర్టికల్‌ 14కు వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
  • విభజనను ఎందుకు అడ్డుకోలేదో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి: అమిత్‌షా
  • మహాత్మా గాంధీ విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేరు: అమిత్‌షా
  • శ్రీలంక తమిళీయులకు పౌరసత్వం ఉంది: అమిత్‌ షా

23:01 December 09

పౌర సవరణ బిల్లుపై అమిత్​షా వివరణ

బిల్లు ఏవిధంగానూ రాజ్యాంగ విరుద్ధం కాదు: అమిత్​షా
శరణార్థులు హక్కులు కోల్పోరు: అమిత్‌షా
శరణార్థుల హక్కులను బిల్లు కాపాడుతుంది: అమిత్‌షా
పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
ఈ బిల్లు ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించదు: అమిత్‌ షా

22:46 December 09

'దేశ విభజనకు దారి తీస్తుంది'

పౌరసత్వ సవరణ చట్టం బిల్లు మరో దేశ విభజనకు దారి తీస్తుందన్నారు ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. బిల్లు పూర్తిగా వివక్షపూరితమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పీఠిక సారాంశానికి వ్యతిరేకంగా ప్రతిపాదిత బిల్లు ఉందని తెలిపారు. 

20:34 December 09

'వివక్ష పూరితం'

పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్​సభ వేదికగా స్పందించారు కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోనే మార్పులు చేయడం ద్వారా శరణార్థులకు ప్రయోజనం చేకూర్చవచ్చని పేర్కొన్నారు. వివక్షతో కూడిన మరో చట్టం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

20:13 December 09

  • AR Chaudhary,Congress in LS:We're opposing #CitizenshipAmendmentBill,as it's discriminatory.The argument of persecuted refugees can be dealt by making separate provisions through amendment in current law for accommodating refugee.A separate discriminatory law is not needed for it pic.twitter.com/mcrxCIuyJ7

'ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదు'

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలె. ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ప్రతిపాదిత చట్టం సుప్రీంకోర్టులో న్యాయపరీక్షకు నిలవలేదని.. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.

20:09 December 09

  • Supriya Sule, NCP on #CitizenshipAmendmentBill2019 in Lok Sabha: Entire ethos of our democracy is equality and talking about Article 14&15, I am not convinced by Home Minister, it will be struck down in Supreme Court. I request him to rethink of it and please withdraw the bill. pic.twitter.com/Z8POt0vk2y

'రాజ్యాంగ విరుద్ధం'

  • పౌరసత్వ సవరణ బిల్లుకు బీఎస్​పీ వ్యతిరేకం
  • రాజ్యాంగ విరుద్ధమైన కారణంగా బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం

20:02 December 09

పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకం...

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లోక్​సభలో స్పష్టం చేసింది తెరాస. తమ పార్టీ లౌకిక విధానాలకు.. బిల్లు విరుద్ధంగా ఉందని.... రాజ్యాంగ దృక్పథం, నిబంధనల్ని తెరాస కచ్చితంగా పాటిస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ ఎంపీ నామ నాగేశ్వరరావు. 

19:46 December 09

పౌరసత్వ బిల్లుకు జేడీయూ, బీజేడీ మద్దతు..!

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పలు ప్రాంతీయ పార్టీలూ కొన్ని షరతులతో మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వైకాపా మద్దతిచ్చింది. తాజాగా జేడీయూ, బీజేడీ కూడా మద్దతిస్తున్నట్లు సంకేతాలిచ్చాయి. పాకిస్థానీ మైనార్టీలకు కూడా.. భారత పౌరసత్వం కల్పించే అంశంపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు జేడీయూ ఎంపీ రాజీవ్​ రంజన్​ సింగ్​.

బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన బీజేడీ.. గతంలో వచ్చిన నివేదికలను దృష్టిలో పెట్టుకొని శ్రీలంకను కూడా ఇందులో చేర్చాలని కోరింది. అదే విధంగా బిల్లు.. ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని వస్తున్న అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని అభిప్రాయపడింది. 

18:59 December 09

పౌరసత్వ బిల్లుపై వైకాపా మద్దతు... కానీ..

  • పౌరసత్వ సవరణ బిల్లుకు వైకాపా మద్దతు
  • మైనార్టీ వర్గీయులు అభద్రతా భావంలో ఉన్నారు: వైకాపా ఎంపీ మిథున్‌ రెడ్డి
  • శరణార్థుల గురించి కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం: మిథున్‌రెడ్డి

18:32 December 09

పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై లోక్​సభలో చర్చ జరుగుతుంది. బిల్లుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారని పేర్కొన్నారు. 

  • పౌరసత్వ సవరణ బిల్లుకు కట్టుబడి ఉన్నాం: అమిత్‌ షా
  • ఇది రాజ్యాంగ ప్రక్రియ: అమిత్‌ షా
  • బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారు: అమిత్‌షా
  • ఎవరి హక్కులను హరించటం లేదు: అమిత్‌ షా
  • బిల్లులో ఎలాంటి రాజకీయ అజెండా లేదు: అమిత్‌ షా
  • మార్పులను స్వాగతిస్తున్నాం: అమిత్‌ షా
  • మేము దేశ ఐక్యతను విశ్వసిస్తున్నాం: అమిత్‌ షా
  • బిల్లుకు 130 కోట్ల దేశ ప్రజల మద్దతు అవసరం: అమిత్‌ షా
  • సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: అమిత్‌ షా
  • 1947 నుంచి శరణార్థులను అంగీకరిస్తున్నాం: అమిత్‌ షా
  • అడ్వాణీ కూడా శరణార్థే: అమిత్‌ షా

17:05 December 09

పౌరసత్వ బిల్లుపై లోక్​సభలో మాటల యుద్ధం

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నాటకీయ పరిణామాల మధ్య లోక్​సభ ముందుకొచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అధికార పక్షంపై మాటల దాడికి దిగాయి విపక్షాలు. బిల్లును సభలో ప్రవేశపెట్టాలో లేదో తేల్చేందుకు ఓటింగ్​ నిర్వహించాలని పట్టుబట్టాయి. విపక్షాల ఆరోపణల్ని తిప్పికొట్టిన కేంద్రం... 293-82 ఓట్ల తేడాతో పౌరసత్వ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టింది.

అధికార, విపక్షాల మాటల యుద్ధం, అసాధారణ రీతిలో ఓటింగ్​ వంటి పరిణామాల మధ్య వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్​సభ ముందుకు వచ్చింది. దిగువసభలో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రతిపాదించగానే... విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు.

'మైనార్టీలే లక్ష్యంగా...'

మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి ఆరోపించారు.

''దేశంలోని మైనార్టీ ప్రజలే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక రాజ్యంగా భారత్‌ ఉండాలని ప్రజలందరూ సంకల్పించుకున్నారు. దేశంలోని ప్రజలందరికీ రక్షణ, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పొందే హక్కు ఉంది.''

             - అధీర్​ రంజన్​ చౌదరి, కాంగ్రెస్​ పక్ష నేత

అధిర్​తో పాటు.. విపక్షాల సభ్యులు సౌగత్​ రాయ్​, ఎన్​కే ప్రేమ్​చంద్రన్​, గౌరవ్​ గొగొయి, శశి థరూర్​, అసదుద్దీన్​ ఓవైసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​.

''పౌరసత్వ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గణతంత్ర మూల విలువలపై దాడి చేసేలా ఉంది. జాతీయ అంశాలను సైద్ధాంతిక, మతపరంగా, భౌగోళికంగా, భాషపరంగా విభజించలేం. మతమే జాతీయతకు గుర్తింపా? అలా భావించేవారు పాకిస్థాన్‌ ఏర్పాటు చేసుకున్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేడ్కర్‌, మౌలానా ఆజాద్‌ తదితరులు మతం ఆధారంగా దేశాన్ని విభజించకూడదని, ఈ దేశం అందరిదని చెప్పారు. అందువల్ల రాజ్యాంగ మూలసూత్రాలకు వ్యతిరేకంగా, వివక్షపూరితంగా ఈ బిల్లును రూపకల్పన చేశారు. ఈ బిల్లుపై చర్చ అవసరం లేదని నమ్ముతూ దీన్ని ముందుకు పంపరాదని విజ్ఞప్తి చేస్తున్నా.''

        - శశిథరూర్‌, కాంగ్రెస్‌ నేత

విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు అమిత్​ షా. దేశంలోకి అక్రమ వలసల్ని నిరోధించేందుకే బిల్లు తీసుకొచ్చినట్లు స్పష్టంచేశారు.

''ఈ బిల్లు కనీసం .001 శాతం కూడా దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా లేదు. బిల్లుపై చర్చ జరగాల్సిన అవసరముంది. బిల్లులోని ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో పౌరసత్వానికి కటాఫ్‌ పెట్టలేదా అని షా ప్రశ్నించారు. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే మైనారిటీలకు రక్షణ ఎక్కువ ఉందని స్పష్టంచేశారు. 1971లో బంగ్లాదేశ్‌ శరణార్థులకు ఇందిరాగాంధీ పౌరసత్వం ఇచ్చారని గుర్తుచేశారు.

ఓటింగ్​తో బిల్లు ప్రవేశం..

అసాధారణ రీతిలో బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్​ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. బిల్లుకు అనుకూలంగా 293, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.

బిల్లులో ఏముంది..?

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లింయేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌కు అక్రమంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.

16:55 December 09

  • పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో ఓటింగ్‌
  • పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు
  • పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 82 ఓట్లు

13:42 December 09

పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​.. అనుకూలంగా తీర్పు

  • దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు: అమిత్ షా
  • దేశ విభజన సమయంలో పౌరసత్వానికి కటాఫ్‌ తేదీ పెట్టలేదా?: అమిత్‌ షా
  • ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, విదేశాల్లోని గ్రీన్‌కార్డులు దేనికి సంబంధించినవి?: అమిత్‌ షా
  • అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయి: అమిత్ షా
  • 1971లో బంగ్లాదేశ్‌ శరణార్థులకు ఇందిరాగాంధీ పౌరసత్వం ఇచ్చారు: అమిత్‌ షా
  • పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే మైనార్టీలకు రక్షణ ఎక్కువ: అమిత్‌ షా

13:25 December 09

అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ బిల్లు: షా

13:00 December 09

బిల్లు రాజ్యాంగ విరుద్ధం: తృణమూల్​

పౌరసత్వ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోక్​సభలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​ తీవ్రంగా స్పందించారు. 

  • మహాత్ముల ఆశయాలకు తూట్లు పొడుస్తూ పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చారు: శశిథరూర్‌
  • రాజ్యాంగ ప్రవేశికకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకం: శశిథరూర్‌

12:59 December 09

బిల్లు.. రాజ్యాంగ ప్రవేశికకు వ్యతిరేకం: థరూర్​

పౌరసత్వ బిల్లుపై లోక్​సభలో వాడీవేడి చర్చ జరుగుతుంది. విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తేలేదని అమిత్​ షా వ్యాఖ్యానించారు. 

  • పౌరసత్వ సవరణ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
  • చర్చలో అన్ని విషయాలు వివరిస్తాం: కేంద్రమంత్రి అమిత్‌ షా
  • ఈ బిల్లు కనీసం .001 శాతం కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా లేదు: అమిత్‌ షా

12:46 December 09

ముస్లింలకు ఏం వ్యతిరేకం కాదు: షా

  • కేవలం మతం ప్రాతిపదికగా ఈ బిల్లును తీసుకువచ్చారు: విపక్షాలు
  • అక్రమ వలసలను నిరోధించేందుకు ఈ బిల్లు తెచ్చామనటం అవాస్తవం: విపక్షాలు
  • దేశంలో ప్రధానమైన మైనార్టీ వర్గాన్ని అడ్డుకునేందుకే ఈ బిల్లు తెచ్చారు.

12:40 December 09

పౌరసత్వ బిల్లుపై విపక్షాల ఆగ్రహం

పార్లమెంట్​లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం చర్చ కొనసాగుతోంది. బిల్లును కాంగ్రెస్​ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్​ లోక్​సభాపక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి.. బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. 

  • పౌరసత్వ సవరణ బిల్లు ప్రకరణ 5, 15లకు వ్యతిరేకం: అధిర్‌ రంజన్‌ చౌధురి
  • సమానత్వ హక్కుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంది: అధిర్‌ రంజన్‌ చౌధురి
  • దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది: అధిర్‌ రంజన్ చౌదరి
  • ప్రాథమిక హక్కులకు పూర్తిగా వ్యతిరేకమైన బిల్లును తీసుకువచ్చారు: అధిర్‌ రంజన్ చౌధురి

12:32 December 09

బిల్లుపై వాడీవేడి చర్చ

  • పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్‌ షా
  • బిల్లులోని ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం: అమిత్‌ షా

12:30 December 09

ప్రతి అంశంపై సమాధానం ఇస్తాం: షా

పౌరసత్వ చట్టసవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్​ షా లోక్​సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఇవాళ చర్చ కొనసాగనుంది. అధికార భాజపాకు మెజార్టీ ఉన్నందున సులువుగానే ఆమోదం పొందే అవకాశముంది. అయితే.. బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దిల్లీలోనూ పలు యూనియన్లు నిరసనలు చేస్తున్నారు. 

12:18 December 09

లోక్​సభలో పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టిన అమిత్​షా

12:12 December 09

పౌరసత్వ బిల్లు ఆమోదంపై భాజపా పార్లమెంటరీ పార్టీ కసరత్తులు

  • పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న భాజపా పార్లమెంటరీ పార్టీ.
  • పార్టీ విప్​లు అందరికీ బాధ్యతలు అప్పగించిన పార్లమెంటరీ పార్టీ.
  • శుక్ర, శనివారాల్లో పార్టీ ఉభయ సభల సభ్యులందరికీ ఫోన్ చేసి తప్పనిసరిగా సభకు హాజరుకావాలన్న పార్టీ.
  • 18 మంది విప్​లకు బాధ్యతలు అప్పగింత.
  • ఒక్కొక్క ఎంపీకి రెండు మూడు రాష్ట్రాల బాధ్యతలు.
  • ఆయా రాష్ట్రాల ఎంపీలు ఎవరూ సభా సమావేశాలకు గైర్హాజరు కాకుండా చూసుకునేలా జాగ్రత్తలు.

12:00 December 09

జంతర్​మంతర్​ వద్ద ఏఐయూడీఎఫ్​ ధర్నా

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఏఐయూడీఎఫ్​(ఆల్​ ఇండియా యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​)... దిల్లీ జంతర్​మంతర్​ వద్ద ధర్నాకు దిగింది. 

11:56 December 09

ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు..

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా త్రిపురలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు.

11:43 December 09

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు సహా... కాంగ్రెస్​, తృణమూల్​ నుంచి బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 10, 2019, 12:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.