మిరపకాయలు ఎంత ఖరీదైనా.. కిలోల కొద్దీ ఎండు మిర్చి తెచ్చుకుని, దంచి కారం పట్టించుకుని నిల్వ చేసుకోవడం మన అలవాటు. వందల కొద్దీ పెరిగితే సరే కానీ, వేలకు వేలు పోసి ఎవరైనా కొంటారా? కొంటారు. ఎక్కడో కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకలో మంజునాథ గాదా రెడ్డి క్వింటా మిరపకాయలను అక్షరాల 33 వేల 333 రూపాయలకు అమ్మి చూపించాడు.
హవేరీలోని బ్యాదగీ పట్టణ రైతు మార్కెట్లో.. దేశంలోనే తొలిసారి క్వింటా మిరపకాయలు రూ.33,333కు విక్రయించి రికార్డు సృష్టించాడు మంజునాథ్. ఒక్కసారిగా ఇంత ఎక్కువ లాభం వచ్చే సరికి.. ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
ఇదీ చదవండి:తమిళనాడులో జల్లికట్టుకు బసవన్నలు సిద్ధం