ETV Bharat / bharat

'అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి' - ఉత్తరప్రదేశ్​లో భద్రతా దళాలను మోహరించిన కేంద్రం

అయోధ్య కేసుపై ఈ నెల 17లోపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉండటం వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది. ఉత్తర్​ప్రదేశ్​లో శాంతి భద్రతల దృష్ట్యా సుమారు 4 వేల పారామిలటరీ దళాలను మోహరించింది.

'అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి'
author img

By

Published : Nov 7, 2019, 5:11 PM IST

అయోధ్య కేసుపై త్వరలోనే సుప్రీం తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో.. ముఖ్యంగా అయోధ్యలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుమారు (40 కంపెనీలు) 4000 పారామిలటరీ దళాలను హోంమంత్రిత్వశాఖ మోహరించింది.

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ సలహా పంపినట్లు హోంమంత్రిత్వశాఖాధికారులు తెలిపారు.

అయోధ్య భూవివాదం కేసుపై సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 17 లోపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి పదవీవిరమణకు ముందే ఈ కేసుపై తీర్పు వెలువరిస్తారని అంతా భావిస్తున్నారు.

కార్తీక పూర్ణిమకు... భక్తుల రద్దీ

వచ్చే వారం కార్తీక పౌర్ణమి (నవంబర్ 12న) రోజున అయోధ్యను వేలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. నవంబర్​ 20 వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు

సంయమనం పాటించండి!

అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి కావాల్సిన రాతి విగ్రహాల పనిని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్​పీ) నిలిపివేసింది. సుప్రీంతీర్పు ఎలా ఉన్నా భక్తులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని వీహెచ్​పీ అధికార ప్రతినిధి శరద్​ శర్మ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'హిమ' కశ్మీరం: మంచు కురిసే వేళలో...

Mumbai, Nov 07 (ANI): While speaking on reports of Shiv Sena shifting its MLAs to a resort, Sena leader Sanjay Raut said it's all rumours. "There is no need for us to do this, our MLAs are firm in their resolve and committed to the party. Those who are spreading such rumours should worry about their MLAs first," said Sanjay Raut.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.