ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అమె పదవిలో ఉన్నప్పుడు పని చేసిన ఇతర అధికారులు కొందరిపైనా కేసులు నమోదయ్యాయి.
చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కూతంబలం ఆడిటోరియం ఆధునీకరణ పనులను నిబంధనలకు విరుద్ధంగా ఓ కన్సల్టెంట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది సీబీఐ.
1985లో నిర్మించిన ఈ ఆడిటోరియాన్ని రూ.7.02కోట్లతో ఆధునీకరించాల్సి ఉండగా రూ.62 లక్షలు ఎక్కువగా ఖర్చు చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ఇదీ చూడండి:జాలర్ల వలలో చిక్కిన 300 కిలోల అరుదైన చేప