ETV Bharat / bharat

'ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు' - BRICS Summit to focus on digital economy

'ఉగ్రవాద నిర్మూలనకై పరస్పర సహకారం'పై బ్రిక్స్ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుందని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ దేశాలు కృషి చేస్తాయని ఆయన తెలిపారు. బ్రిక్స్​ సదస్సు కోసం మోదీ బ్రెజిల్​ బయలుదేరి వెళ్లారు.

ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు: మోదీ
author img

By

Published : Nov 12, 2019, 5:42 PM IST

Updated : Nov 12, 2019, 8:35 PM IST

'ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు'

బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో పరస్పర సహకారానికి యంత్రాంగాలను కూడా రూపొందించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.

నవంబర్​ 13, 14 తేదీల్లో జరిగే 11వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్​ బయలుదేరే ముందు ఓ ప్రకటన ద్వారా ఈ విషయం వెల్లడించారు మోదీ.

"'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థిక వృద్ధి' అంశంపై బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా.. వారితో నా అభిప్రాయాలు పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

బ్రెజిల్​తో ద్వైపాక్షిక భాగస్వామ్యం

బ్రెజిల్​ - భారత్​ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సమావేశం కానున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు కృషి చేస్తామని చెప్పారు.

రష్యా, చైనా అధ్యక్షులతో..

మోదీ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తోనూ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ముగింపు వేడుక, బ్రిక్స్ ప్లీనరీ సెషన్లకూ హాజరుకానున్నారు.

బ్రిక్స్

బ్రిక్స్​లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా సభ్యదేశాలు. ఈ ఐదు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మొత్తం జనాభా.. ప్రపంచ జనాభాలో 42 శాతం. ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో బ్రిక్స్​ వాటా 23 శాతం.

బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. మోదీ మొదటిసారిగా 2014లో బ్రెజిల్​ ఫోర్టాలెజాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు.

ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 12 November 2019
1. German Chancellor Angela Merkel arriving
2. Merkel talking
3. Conference venue
4. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
"I support Ursula von der Leyen when she says that the European continent should be the first continent that is climate neutral and that demonstrates how to achieve the future way of doing business in terms of technology and innovation."
5. Audience
6. SOUNDBITE (German) Angela Merkel, German chancellor
"But I give this (Brexit) deal a very big chance that it will be accepted on the British side and that would be good for all of us. Why did it succeed now? It succeeded with Great Britain because it was clearer what Great Britain wants. On the one hand it is a painful outcome, no customs union and a third country that is basically living on our doorstep as a competitor - we have to be quite aware of that, it will put us under additional pressure."
7. Camera
8. Audience
STORYLINE:
German Chancellor Angela Merkel is optimistic that Britain would be able to approve a withdrawal deal that would be "be good for all of us."
But Merkel, speaking at a conference in Berlin, cautioned that Brexit was a "painful outcome" that would make Britain a third country "basically living on our doorstep as a competitor," and "placing additional pressure on the EU and Britain itself'.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 12, 2019, 8:35 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.