ETV Bharat / bharat

కర్ణాటక: రెబల్​ ఎమ్మెల్యేల చుట్టూ ఉపఎన్నికల పోరు

కర్ణాటక ఉపఎన్నికల పోరు రెబల్​ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ సాధించేందుకు ప్రయత్నాలు చేపట్టింది భాజపా. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామని ప్రకటించింది. భాజపా ప్రకటనను ఖండించాయి కాంగ్రెస్​, జేడీఎస్​. ఉప ఎన్నికలో రెబల్​ ఎమ్మెల్యేలను ఓడించటమే తమ ప్రధాన అజెండాగా పేర్కొన్నాయి.

కర్ణాటక: రెబల్​ ఎమ్మెల్యేల చుట్టూ ఉపఎన్నికల పోరు
author img

By

Published : Nov 17, 2019, 9:27 PM IST

కర్ణాటక ఉపఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 15 స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాలని చూస్తోంది భాజపా. ఈ ఎన్నికల్లో గెలిచినవారని మంత్రి పదవుల్లోకి తీసుకుంటామనే వాదనను బలంగా వినిపించి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. ఉపఎన్నికలు జరుగుతున్న 15 స్థానాల్లో 13 మంది రెబల్​ ఎమ్మెల్యేలకే టికెట్​ ఇచ్చింది.

మరోవైపు కాంగ్రెస్​, జేడీఎస్​ పార్టీలు మాత్రం.. ఉపఎన్నికల్లో రెబల్​ ఎమ్మెల్యేల ఓటమి తమ ప్రధాన అజెండాగా ప్రకటించాయి. ఎన్నికల్లో గెలుపొందిన వారిని మంత్రి పదవుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించాడాన్ని తప్పుపట్టాయి.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.

రెబల్​ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తామన్న యడియూరప్ప ప్రకటనను తప్పుపడుతూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్​. ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల విజయ అవకాశాలను పెంచేందుకు ఓటర్లను ప్రేరేపించటం, ప్రభావింతం చేయడానికి ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించింది.

భాజపాలోకి 16 మంది...

ఉప ఎన్నికల్లో రెబల్​ ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు ఈ నెల 13న సుప్రీం కోర్టు అనుమతించింది. ఆ మరుసటి రోజునే 17 మంది రెబల్​ ఎమ్మెల్యేల్లో 16 మంది భాజపాలో చేరారు. ఇందులో 13 మందికి ఇప్పటికే టికెట్లు కేటాయించింది అధికార పార్టీ. యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ సాధించటానికి మరో 6 స్థానాలు అవసరం. ప్రస్తుతం 15 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో 15 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

మా వాగ్దానంలో తప్పేమి లేదు...

భాజపా అభ్యర్థులు ఉప ఎన్నికల్లో నెగ్గితే మంత్రి పదవులు పొందుతారని ప్రకటించటంలో తప్పేమి లేదని స్పష్టం చేశారు యడియూరప్ప. ఇందులో ఉన్న నేరమేంటో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఎవరిని మంత్రిగా చేయాలి, ఎవరిని తొలగించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని తెలిపారు.

ఓట్లు అడిగేందుకు సిగ్గు పడాలి: కాంగ్రెస్​

ప్రభుత్వాన్ని కూలదొసిన రెబల్​ ఎమ్మెల్యేలు తిరిగి ఉపఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సిగ్గు పడాలని అభిప్రాయపడ్డారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య. భాజపాను, రెబల్​ ఎమ్మెల్యేలను ఓడించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వారి అనర్హతపై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినప్పటికీ.. ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన బుద్ధి చెబుతారని అన్నారు. 15 స్థానాల్లో కనీసం 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రెబల్​ ఎమ్మెల్యేల ఓటమే అజెండా: జేడీఎస్​

ఉపఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తోన్న జేడీఎస్​.. రెబల్​ ఎమ్మెల్యేల ఓటమే తమ ప్రధాన అజెండా అని పేర్కొంది. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి కలత చెందారని.. వారిని గెలిపించుకునేందుకే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు హెచ్​డీ దేవేగౌడ.

రేపటితో ఆఖరు..

ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్​ గడువు రేపటితో ముగియనుంది. డిసెంబర్​ 5న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్​ నేర్చుకోవాల్సింది?

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 17 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1242: Kosovo England Football Welcome AP Clients Only 4240343
Pristina prepares warm welcome for England fans and players
AP-APTN-1226: Hong Kong Human Chain AP Clients Only 4240341
Protesters form human chain in Hong Kong
AP-APTN-1218: Belarus Lukashenko Vote AP Clients Only 4240340
President Lukashenko votes in parliamentary election
AP-APTN-1206: Sri Lanka Rajapaksa AP Clients Only 4240331
Former Sri Lankan defence chief wins presidential vote
AP-APTN-1200: Thailand US SKorea Japan AP Clients Only 4240337
US Sec of Defense meets SKorean counterpart
AP-APTN-1158: Iraq Clashes AP Clients Only 4240335
Protesters clash with security forces in anti-govt demo
AP-APTN-1144: Austria Snow No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4240333
Heavy snowfalls cause road chaos in Matrei
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.