పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్న నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేటి సమావేశంలో భాజపా నేతలు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన నేపథ్యంలో పార్లమెంట్లో గతవారం దూమారం చెలరేగింది. ఈ కారణంగా ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నిషేధిస్తూ భాజపా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నేటి సమావేశానికి గైర్హాజరు కానున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : భారతీయ రైల్వే పనితీరు మెరుగుపడాలి : కాగ్