పశ్చిమ బంగలో ఈనెల 25న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీతో దూకుడు కనబరుస్తోంది టీఎంసీ.
కలియాగంజ్‌లో విజయం..
కలియాగంజ్ స్థానంలో టీఎంసీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి తపన్ దేవ్ సిన్హా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కమల్ చంద్ర సర్కార్‌పై 2,304 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఆధిక్యంలో..
ఖరగ్‌పుర్, కరింపుర్ స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ అభ్యర్థులు.. ప్రత్యర్థి భాజపాపై భారీ మెజారిటీతో దూసుకెళుతున్నారు.
భాజపా అహంకారానికి సరైన సమాధానం: మమత
"అహంకార ధోరణితో రాష్ట్ర ప్రజలను అవమానించే భాజపాకు ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం" అని పేర్కొన్నారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఉప ఎన్నికల విజయాన్ని బంగాల్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, సీపీఎం తమ పార్టీలను బలపర్చుకోవాల్సింది పోయి.. భాజపాకు వంతపాడుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'మార్గదర్శి' శరద్ పవార్‌పై శివసేన ప్రశంసల జల్లు