ETV Bharat / bharat

'నిర్భయ' దోషుల కోసం ఆ​ జైలులో ఉరి తాళ్ల తయారీ? - నిర్భయ దోషుల కోసం బక్సర్ జైలులో ఉరితాళ్ల తయారీ

డిసెంబర్​ 14లోగా 10 ఉరితాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్​ బక్సర్​ కారాగారానికి జైళ్ల డైరక్టరేట్​ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని డిసెంబర్​ 16న నిర్భయ కేసు దోషులను ఉరితీసేందుకేనని ఊహాగానాలు జోరందుకున్నాయి.

Bihar jail asked to make execution ropes; speculation rife   it's for Nirbhaya convicts
'నిర్భయ' దోషుల కోసం ఆ​ జైలులో ఉరి తాళ్ల తయారీ?
author img

By

Published : Dec 9, 2019, 2:57 PM IST

Updated : Dec 10, 2019, 4:16 PM IST

'నిర్భయ' దోషుల కోసం ఆ​ జైలులో ఉరి తాళ్ల తయారీ?

నిర్భయ కేసు దోషులకు అతి త్వరలోనే మరణ శిక్ష అమలు చేయడం ఖాయమా? 2012లో వైద్యవిద్యార్థినిపై అకృత్యానికి పాల్పడిన డిసెంబర్​ 16 అందుకు ముహూర్తమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ. ఉరి తాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్​లోని బక్సర్​ జైలుకు ఆదేశాలు వెళ్లడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.

10 ఉరి తాళ్లకు ఆర్డర్

"డిసెంబర్​ 14కల్లా 10 ఉరి తాళ్లు సిద్ధంగా ఉంచాలని జైళ్ల డైరక్టరేట్​ నుంచి మాకు ఆదేశాలు అందాయి. అవి ఎవరి కోసం ఉపయోగిస్తారో మాకు తెలియదు. ఉరి తాళ్ల తయారీలో బక్సర్​ జైలుకు మంచి పేరు ఉంది."
-విజయ్ కుమార్​ అరోరా, బక్సర్​ జైలు ఎస్పీ

బక్సర్​ ఉరి తాళ్ల విశేషాలు:

  • ఒక్కో ఉరి తాడు తయారీకి 3 రోజులు పడుతుంది. తయారీ అంతా దాదాపుగా చేతి పనే. యంత్రాల వాడకం చాలా తక్కువ.
  • ఉగ్రవాది అఫ్జల్​ గురుకు మరణశిక్ష అమలుకు బక్సర్ ఉరి తాడునే ఉపయోగించారు.
  • పాటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్ల తయారీకి గతంలో ఆర్డర్ వచ్చింది. కానీ అవి ఎవరి కోసమో స్పష్టత లేదు.

ఖరీదు ఎక్కువే...

చివరిసారిగా బక్సర్ జైలు సరఫరా చేసిన ఉరి తాడు ధర.1,725గా ఉంది. ఈ ధర ఉక్కు, ఇత్తడి ధరల ఆధారంగా మారుతుంది. ఈ లోహాలతో తయారుచేసే తాడు మనిషికి ఉరేసినప్పుడు తెగకుండా ఉంటుంది. గొంతుకు వెంటనే బిగుసుకొని క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది.

"ఈ ఉరితాళ్లను సాధారణంగా ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు తయారుచేస్తారు. 7000 దారం పోగులతో ఒక తంతువు తయారుచేస్తారు. ఇలాంటి 152 తంతువులు ఉపయోగించి కావలసిన కొలతలతో ఒక ఉరితాడు తయారుచేస్తారు."
- విజయ్ కుమార్​ అరోరా, బక్సర్​ జైలు ఎస్పీ

ఈ తాళ్లను ముందుగానే తయారుచేసి ఉంచరు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ ఇవి పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే అవసరమైనప్పుడే వీటిని తయారుచేస్తారు.

'దిశ' ప్రభావం..

హైదరాబాద్​కు చెందిన యువ పశువైద్యురాలు దిశ హత్యాచార నిందితులకు పోలీసులు ఎన్​కౌంటర్​ చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిర్భయ హంతకులకు కూడా వీలైనంత త్వరగా మరణశిక్ష అమలుచేయాలని ప్రజలు, ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయానికి తెర.. భాజపా డబుల్ సిక్సర్​​.. యడ్డీ సేఫ్​

AP Video Delivery Log - 0800 GMT News
Monday, 9 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0757: Stills New Zealand Volcano Visitors Must credit; 14 days news use only; No archive, no licensing 4243767
Photos show tourists near NZ volcano's crater
AP-APTN-0750: New Zealand Volcano Injured 3 No access New Zealand 4243766
Ambulances, helicopters assist NZ volcano injured
AP-APTN-0730: Dominican Republic Ortiz AP Clients Only 4243743
Baseball's Ortiz in 1st appearance since shooting
AP-APTN-0716: New Zealand Volcano UGC Must credit content creator; No archive; No resale 4243765
Moments after NZ eruption caught on camera
AP-APTN-0713: New Zealand Volcano Briefing 2 No access New Zealand 4243763
NZ officials on eruption impact, injuries, cruise ship
AP-APTN-0704: China Xinjiang AP Clients Only 4243764
China: Xinjiang detainees 'living happy lives'
AP-APTN-0628: New Zealand Volcano Briefing No access New Zealand 4243760
NZ authorities on volcano eruption rescue operation
AP-APTN-0602: Still New Zealand Volcano Aerial No access New Zealand, Australia; No archive, no resale 4243762
Plume of smoke rising over NZ island after eruption
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 10, 2019, 4:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.