ప్రస్తుత యువత అంతర్జాలంలోనే చరవాణిలను కొనడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం కొన్న వస్తువులకు బదులు రాళ్లు, ఇనుప వస్తువులు, పండ్లు రావటం వంటి మోసాలు జరుగుతుంటాయి. ఈ మోసాలకు సామాన్య ప్రజలే కాదు.. బంగాల్‌కు చెందిన ఓ భాజపా ఎంపీ కూడా బలయ్యారు. తాను ఆర్డర్ ఇచ్చిన మొబైల్‌కు బదులుగా రాళ్లు రావటాన్ని గుర్తించి ఆశ్చర్యానికి గురైన ఆ ఎంపీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

అసలేం జరిగింది...
బంగాల్లోని మాల్డా ఉత్తర ప్రాంతానికి చెందిన భాజపా ఎంపీ ఖాగెన్ ముర్ము కుమారుడు అనిమెస్ ముర్ము.. ప్రముఖ ఆన్లైన్ సంస్థలో ఈ నెల 23న శాంసంగ్ మొబైల్‌ను బుక్ చేశారు. ఈ చరవాణి ధర రూ. 11,999.

శాంసంగ్ మొబైల్ ఆర్డర్ ఇస్తే... షియోమీ బాక్స్ వచ్చిందని... అందులోనూ చరవాణికి బదులు రెండు రాళ్లు ఉండటం చూసి ఆశ్చర్య పోయినట్టు తెలిపారు ముర్ము. మోసం జరిగిందని గుర్తించిన ఆయన.. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:ఆపరేషన్ 'సాగర్': బాగ్దాదీకీ లాడెన్ గతే..!