ETV Bharat / bharat

అయోధ్య తీర్పుతో ఆ బ్యాంకు ఖాతాదారులకు బోనస్​!

ఉత్తర్​ప్రదేశ్​లోని 'రామ్​ నామ్​ బ్యాంక్'​ తన ఖాతాదారులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ బ్యాంకు.. తమ ఖాతాదారులకు బోనస్​ ప్రకటించింది. అయితే ఇది సామాన్యమైన బ్యాంక్​ కాదు. ఆ బోనస్​ సాధారణమైంది కాదు. మరి ఈ కథేంటో చూడండి.

అయోధ్య తీర్పుతో ఆ బ్యాంకు ఖాతాదారులకు బోనస్​!
author img

By

Published : Nov 17, 2019, 5:01 PM IST

'రామ్​ నామ్ బ్యాంక్'... ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​లోని ఓ బ్యాంక్​. అయితే ఈ బ్యాంక్​ ఏటీఎమ్​ కార్డ్​లు, పాస్​బుక్​లు ఇవ్వదు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వీళ్లు డబ్బు జమ​ చేసుకోరు. వీళ్లు డిపాజిట్​ చేసుకునేది.. కేవలం 'రామ'నామం.​ ఈ బ్యాంకు ఖాతాదారులు రామనామం రాసిన బుక్​లెట్లను ఇక్కడ డిపాజిట్​ చేస్తారు.

అయోధ్య తీర్పుతో ఈ బ్యాంకు తమ ఖాతాదారుల్లో లక్ష మందికి బోనస్​ ప్రకటించింది. నవంబర్ ​9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్​లో డిపాజిట్​ చేసిన ఖాతాదారులకు ఈ అవార్డ్ ఇవ్వనుంది.

ఇదే బోనస్​...

ఇక్కడ బోనస్​ ఏంటంటే... ఖాతాదారులు చేతితో రాసిన, టైప్​ చేసిన, మొబైల్​ యాప్​లో టైప్​ చేసిన ఒక్కొక్క రామనామాన్ని రెండుగా పరిగణిస్తారు. ఈ బోనస్​ గురించి రామనామ సేవా సంస్థానం ఛైర్మన్​ వివరించారు.

"ఉదాహరణకు ఒక భక్తుడు ఒకసారి రామనామాన్ని రాస్తే దాన్ని.. రెండుగా పరిగణిస్తాం. ఇందుకోసం కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రచించి ఉండాలి. అలా రాసిన ఖాతాదారులకు ఈ అవార్డ్​​ దక్కుతుంది. నవంబర్​ 10న ఈ బోనస్​ ప్రకటించాం."
-అశుతోష్​ వార్ణ్షే, రామ నామ సేవా సంస్థానం ఛైర్మన్​

బుక్​లెట్​...

రామ నామ్​ బ్యాంక్​ ఇచ్చే ఈ బుక్​లెట్​లో 30 పేజీలు ఉంటాయి. ఒక్కొక పేజీలో 108 గళ్లు ఉంటాయి. అందులో 'రామ' నామాన్ని రాయాలి.

అవార్డ్​...

ఈ అవార్డ్​కు ఎన్నికైన వారికి బ్యాంక్​ తరఫున ఓ సర్టిఫికెట్​ వస్తుంది. 2020లో అలహాబాద్​ సంఘం ప్రాంతంలో జరిగే మెగామేళాలో వీరిని సత్కరిస్తారు. 12 మందికి పైగా భక్తులు ఇప్పటివరకు కోటిసార్లు రామనామాన్ని రాసి బ్యాంక్​కు​ ఇచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు.

2019-కుంభమేళాలో ప్రమాణం...

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాముడు సరైన దారి చూపాలని కోరుతూ.. 2019 కుంభమేళా సమయంలో దాదాపు 1200 మంది భక్తులు రామనామాన్ని రాస్తామని ప్రమాణం చేశారు. కోరిక తీరినందున వారంతా బ్యాంక్​లో బుక్​లెట్లు డిపాజిట్​ చేస్తున్నారు.

Barmer (Rajasthan), Nov 17 (ANI): The Sudarshan Chakra Corps of the Indian Army conducted 'Sindhu Sudarshan' exercise in Rajasthan's Barmer on November 16. Around 40,000 jawans of the Indian Army are participating in the exercise. 'Sindhu Sudarshan' exercise will continue till December 05.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.