ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్య ప్రభావం ప్రజలపైనే కాదు దేవుడి విగ్రహాల మీద కూడా పడుతోంది. వారణాసిలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నందున దేవుని విగ్రహాలకు మాస్క్‌లు పెడుతున్నారు. వాటి ద్వారా భగవంతుడ్ని వాయు కాలుష్యం నుంచి రక్షించినవాళ్లం అవుతామని అక్కడి భక్తులు చెబుతున్నారు.
ప్రమాదకర స్థాయిలో..
దీపావళి తరువాత దిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనివల్ల వారణాసి ప్రజలు ముఖాలకు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దేవుని విగ్రహాలు కూడా చేరాయి. వారణాసి సిగర్ పరిధిలోని శివపార్వతి మందిరంలోని విగ్రహాలకు అక్కడి పూజారి, భక్తులు మాస్క్‌లను తొడిగారు. శివ లింగం, కాళీమాత విగ్రహం, షిర్డీ సాయి విగ్రహాలకు ముసుగులు వేశారు.
మానవరూపంలో కొలుస్తాం..
వారణాసి ప్రజలంతా దేవుడిని మానవ రూపంలో కొలుస్తారని, అందుకే వేసవిలో వేడి నుంచి కాపాడటానికి విగ్రహాలకు చందనం రాస్తామని పూజారి తెలిపారు. చలి నుంచి రక్షించడానికి కంబళ్లు, స్వెట్టర్లు వేస్తామని అలాగే ఇప్పుడు కాలుష్యం బారి నుంచి కాపాడటానికి మాస్క్‌లు వేశామని వివరించారు.
ఇదీ చూడండి: పాపం పులి... ఎరక్కపోయి ఇరుక్కుపోయింది