భారత నౌకా దళ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై.. నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డీఆర్డీఓ తయారు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ విమానాన్ని ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై దించడం ఇదే తొలిసారి.
అరెస్టెడ్ ల్యాండింగ్ సక్సెస్ కావడం వల్ల నౌకాదళంలో ఆనందోత్సహాలు వెల్లి విరిశాయి. ఈ మైలురాయితో భారత నౌకాదళానికి కావాల్సిన ట్విన్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామని.. భారత నౌకదళ ప్రతినిధి ట్విట్టర్‌లో తెలిపారు. భారత యుద్ధ విమాన అభివృద్ధి ప్రక్రియకు.. ఇదో గొప్ప సందర్భమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి;పాక్ దుశ్చర్యలపై మౌనమెందుకు మోదీజీ..?'