మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కఠిన పరీక్ష ఎదుర్కోవాలని అన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అగ్నీపథ్(అగ్ని కీలల దారి) పదాన్ని మూడు సార్లు వినియోగించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన ముందుకు సాగాల్సిన తీరుకు సంకేతంగా ఉంది రౌత్ ట్వీట్.
-
अग्नीपथ
— Sanjay Raut (@rautsanjay61) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
अग्नीपथ
अग्नीपथ...
">अग्नीपथ
— Sanjay Raut (@rautsanjay61) November 13, 2019
अग्नीपथ
अग्नीपथ...अग्नीपथ
— Sanjay Raut (@rautsanjay61) November 13, 2019
अग्नीपथ
अग्नीपथ...
హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ప్రముఖ రచన 'అగ్నీపథ్'. ఈ టైటిల్‌తో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా 1990లలో విడుదలైన చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
విజయం సాధించే వరకు విరామం తీసుకోరాదన్న హరివంశ్ రాయ్ కవితను నిన్న కూడా ట్వీట్ చేశారు రౌత్.
ట్వీట్ల తూటాలు...
మహారాష్ట్ర ఎన్నికల ఫలితం వెలువడిన నాటి నుంచి భాజపాపై మాటల తూటాలు పేల్చుతున్నారు రౌత్. అనారోగ్యం కారణంగా ఈనెల 11న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అక్కడి నుంచే ట్వీట్లు చేస్తున్నారు. కొద్ద సేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు రౌత్.
ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది సేన. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినందున మంగళవారం రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
ఇదీ చూడండి: 'అయోధ్య ట్రస్టులో సభ్యులుగా అమిత్ షా, యోగి!'