మహారాష్ట్ర వార్దాలోని హింగాన్ఘాట్లో ఓ యువతిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించాడో దుండగుడు.
బాధితురాలు ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. ఉదయం నందోరీ చౌక్ దారిలో వెళ్తుండగా.. ఆమెపై పెట్రోల్ పోశాడు మాజీ ప్రియుడు విక్కీ. అందరూ చూస్తూండగానే నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న యువతిని రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పరిస్థితి విషమంగా ఉందని ఆమెను నాగ్‌పుర్ ఆసుపత్రికి మార్చినట్లు తెలిపారు పోలీసులు. ఘటనకు గల కారణాలపై పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.